వామ్మో.. లంగా ఓణిలో గుప్పెడంత మనసు జగతి.. పెద్దల ట్రీట్మెంట్ తర్వాత చూశారా..?

టాలీవుడ్ బుల్లితెర అభిమానులకు జగతి మేడం అలియాస్ జ్యోతిరాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటించింది కేవలం ఒక్క తెలుగు సీరియల్‌లోనేనైనా భారీ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. ఈ సీరియల్‌లో సంప్రదాయ దుస్తులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అచ్చ‌తెలుగు ఆడ‌ప‌డుచులా ఆడియ‌న్స్‌ను మెప్పించింది. అయితే బయట మాత్రం సీరియల్‌కు పూర్తి విరుద్ధంగా.. చిట్టి పొట్టి బట్టలతో గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ ఉంటుంది.

ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్లను ఆకట్టుకున్న‌ ఈ ముద్దుగుమ్మ.. పాన్ ఇండియ‌న్ స్టార్ హీరోయిన్ రేంజ్‌లో అందాల ఆరబోతలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా లంగా ఓణి ధరించి నాభి అందాలు చూపిస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది జ్యోతి రాయ్‌. అయితే ఎప్పుడు వేసుకునే హాట్‌ దుస్తులకు భిన్నంగా.. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన జ్యోతి రాయ్‌ను చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎప్పుడు బోల్డ్ గా ఉండే జగతి మేడం.. ఒక్కసారిగా లంగా ఓణీల్లో మెరవడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటూ.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే తాజాగా జ్యోతిరాయ్ తన లిప్ ఫిల్లర్‌ ట్రీట్మెంట్‌తో లుక్ మొత్తం మార్చేసింది. మరింత అందంగా కనిపించేందుకు జ్యోతిరాయ్‌ ఈ ట్రీట్మెంట్ చేయించుకుంది. అయితే ఈ ట్రీట్మెంట్‌తో అమ్మడి మొహం అంత మారిపోయింది. నాచురల్‌గా ఎంతో అందంగా కనిపించే జ్యోతిరాయ్‌ను ఈ ట్రీట్మెంట్ తర్వాత అసలు చూడలేకపోతున్నామంటూ.. ఆ ఫేస్ లో ఉండే అందమంతా పోయిందంటూ.. నీకు ఇలాంటి స‌ర్జ‌రీలు అవ‌స‌ర‌మా డార్లింగ్.. నార్మ‌ల్‌గానే బాగుంటావంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.