స్టార్ బ్యూటీ కృతి సనన్ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన వన్ నేనొక్కడినే సినిమాతో 2014లో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో కంటే బాలీవుడలో స్టార్ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని వరుస ప్రాజెక్టులో నటిస్తూ బిజీగా గడుతుంది. ఇక ఈ అమ్మడు.. గతేడాది రిలీజ్ అయిన ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో సీతగా నటించింది. ఈ సినిమాలో తన అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా ఈ అమ్మడికి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఈ అమ్మడు తనకంటే పదేళ్లు చిన్నవాడైన ఓ అబ్బాయి తో రొమాన్స్ చేస్తుందంటూ.. వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ వార్తలపై రియాక్ట్ అయిన కృతిసనన్ మాట్లాడుతూ.. తనకంటే పదేళ్ల చిన్న వ్యక్తితో డేటింగ్ చేస్తున్నాడు అంటూ వచ్చిన రూమర్స్ తనను ఎంతగానో బాధించాయని వివరించింది. యూకే కు చెందిన కబీర్ బహ్రియాతో కృతి సన్ డేటింగ్ చేస్తుందంటూ.. కబీర్ తోనే కలిసి ఆమె పుట్టినరోజు వేడుకలను చేసుఉకందంటూ.. వీళ్లిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. దీనిపై తాజాగా స్పందించిన కృతి నా గురించి తప్పుడు వార్తలు రాసినప్పుడు నాతోపాటు.. నా కుటుంబం కూడా ఎంతో ఇబ్బంది పడుతుందని, బాధపడుతుందని, దానివల్ల వచ్చే సమస్యలను మేమంతా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాంటి వార్తలు అయినా సోషల్ మీడియా ద్వారా చాలా త్వరగా ప్రేక్షకుల్లోకి వెళ్తాయి. ఈ వార్తలు నిజమని నమ్మి చాలామంది నాకు సోషల్ మీడియా ద్వారా మెసేజ్లు చేస్తున్నారు.
ఈ అబద్ధాల గురించి ప్రతిసారి స్పందించాలంటే చిరాకుగా ఉంటుంది. అన్నిటికంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. 34 ఏళ్ల కృతి తనకంటే పదేళ్ల చిన్న వ్యక్తితో డేటింగ్ చేస్తుంది.. ఈ హెడ్డింగ్ తో ఎంతోమంది వార్తను ప్రచురించారు. ఏ మాత్రం నిజం తెలుసుకోకుండా ఇలా రాయడం ఈరోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు సోషల్ మీడియా లేకపోవడంతో వార్తా పత్రికలో వచ్చిన వార్తను చూసిన తర్వాత మాత్రమే ప్రజలు ఓ అభిప్రాయానికి వచ్చేవారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వార్తలు రాయడం.. నెగటివ్ కామెంట్స్ పెట్టడం.. ట్రెండ్ గా మారిపోయింది. వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేస్తూ అవతలి వారిని ఇబ్బందిని కూడా గుర్తించకుండా.. రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒకటి కాదు ఎన్నో వార్తలు ఇలాంటివి వినిపిస్తూనే ఉన్నాయి అంటూ కృతి సనన్ అసహనం వ్యక్తం చేసింది.