టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈయన.. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగాడు. అలాంటి కృష్ణవంశీ.. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమాలేవి ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేకపోతున్నాయి. కాగా గతంలో మాత్రం కృష్ణవంశీ తర్కెక్కించిన సినిమాలను చూడడానికి అభిమానులు కూడా ఎంతో ఆరాటపడుతూ ఉండేవారు. అలాంటి సినిమాల్లో మహేష్ బాబు హీరోగా సోనాలి బింద్ర హీరోయిన్గా వచ్చిన మురారి సినిమా కూడా ఒకటి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ తాజాగా మహేష్ బాబు బర్త్డే రోజు రీ రిలీజై ఎలాంటి విజయాన్ని దక్కించుకుందో చెప్పాల్సిన అవసరం లేదు.
రీ రిలీజ్ మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాగా రికార్డును సృష్టించింది. ఇక ముందు ముందు రీ రిలీజ్తో భారీ కలెక్షన్‌లు సాధించిన సినిమాల్లో మురారి నెంబర్‌వన్ స్థానంలో నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే కృష్ణవంశీ, పవన్ కళ్యాణ్ కాంబోలో ఓ హిట్ స్టోరీ మిస్ అయింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏవో అనుకొని కారణాలవల్ల ఈ సినిమా డిలే అయిందని సమాచారం. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత.. కృష్ణవంశీతో సినిమా చేయాల్సి ఉందట. కానీ.. అప్పుడు పవన్ కళ్యాణ్ మరో సినిమాతో బిజీగా ఉండడం.. తర్వాత కృష్ణవంశీ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో వీళ్ళ కాంబినేషన్లో రావాల్సిన సినిమా పోస్ట్‌పోన్ అవుతూ వచ్చిందట.
దీంతో వీళ్ళ కాంబోలో ఒక మంచి సినిమా కూడా ఇప్పటివరకు తెరకెక్కలేదు. అయితే తర్వాత పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా మారిపోవడం.. కృష్ణవంశీ కూడా తన దారి తాను చూసుకోవడంతో ఈ సినిమా అగిపోయింది. దీంతో ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా కూడా రాలేదు. ఇకపై వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలు కూడా లేవనే చెప్పాలి. ఎందుకంటే పవన్ ప్రస్తుతం రాజకీయపరంగా బిజీగా ఉన్నాడు. అయినా సినిమాలో నటించడం అంటే అది సాధారణ విషయం కాదు. ఓ పక్కన రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ.. ఉన్న సినిమాలను పవన్ కళ్యాణ్ పూర్తిచేసి ఇక సినిమాలకు కాస్త బ్రేక్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయం లో ఉన్నట్లు సమాచారం. ఇలాంటి క్రమంలో కృష్ణవంశీ చెప్పిన కథను పవన్ కళ్యాణ్ వినడం.. అది నచ్చే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది చాలా కష్టతరమే. మరి ఇలాంటి క్రమంలో వీళ్ళిద్దరికీ కాంబినేషన్‌లో ఫ్యూచర్లో అయినా ఓ సినిమా వస్తుందో లేదో చూడాలి.