మెగాస్టార్ నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. తన నటనతో లక్షలాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ హీరో.. తండ్రికి మించిన తనయుడుగా పాన్ ఇండియన్ ఇయేజ్ సంపాదించుకొని దూసుకుపోతున్నాడు. అయితే ఓ స్టార్ కిడ్ అయినా.. పాన్ ఇండియన్ స్టార్ హీరో ఇమేజ్ ఉన్నా చరణ్ మాత్రం.. ఎప్పుడు సింప్లిసిటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇక ప్రస్తుతం గ్లోబల్ స్టార్ చరణ్ సినిమాలన్నీ కూడా భారీ లెవెల్ లో రూపొందుతున్నాయి.
అయితే గతంలో ఓ మొబైల్ కంపెనీకు బ్రాండ్‌అంబాసిడర్‌గా రామ్ చరణ్ వ్యవహరించారు. ఈ యాడ్ ద్వారా వచ్చిన మొత్తం సంపాదన అంతా చరణ్ అప్పట్లో అనాధ పిల్లల కోసం ఖర్చు చేశారంటూ.. ఓ న్యూస్ నెటింట వైరల్ గా మారుతుంది. ఈ విషయాన్ని చరణ్ చెప్పడానికి ఇష్టపడకున్నా.. చరణ్ సన్నిహితుల ద్వారా ఈ వార్త బయటకు వచ్చింది. ఇక ప్రస్తుతం చరణ్ ఫ్యాన్స్‌తో పాటు.. మెగా అభిమానులు ఈ వార్తను తెగ వైరల్ చేస్తూ.. ఆయనను ఎంత మెచ్చుకున్న తక్కువేనని.. రామ్ చరణ్ సినిమాలోనే కాదు రియల్ లైఫ్ లోను గ్రేట్ హీరో అంటూ.. మెగా వారసుడనిపించుకున్నాడుగా అంటూ.. అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఇక ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూట్‌లో చరణ్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత.. చరణ్ నుంచి వస్తున్న సోలో సినిమా కావడంతో గేమ్ చేంజర్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కార్తిక్ సుబ్బరాజు కథ అందించిన ఈ సినిమాకు.. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న మొట్టమొదటి తెలుగు సినిమా ఇదే కావడంతో.. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక 300 కోట్ల భారీ బడ్జెటతో తెరకెక్కుతున్న ఈ సినిమా లో కియారా అద్వానీతో పాటు.. అంజలి కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఈ క్రమంలో ఏ సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ.. అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్ మరోసారి పాన్ ఇండియా లెవెల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.