ఆ స్టార్ క్రికెటర్ బయోపిక్ కు తారక్ పై ఫోకస్ పెట్టిన బాలీవుడ్.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడుగా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిగా నటనతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న తారక్.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తారక్ తొందరలోనే మరో భారీ ప్రాజెక్టును నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఇండియన్ క్రికెట్ టింకు చాలా సంవత్సరాల పాటు తన సేవలను అందించి అండగా నిలిచిన ఓ స్టార్ క్రికెటర్ బయోపిక్ లో తను నటించబోతున్నాడట‌. ఇంత‌కి ఆ క్రికెట‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారా.. అత‌ను మరెవరో కాదు రోహిత్ శర్మ.

Rohit Sharma Oneday Record - India 2023

ఇండియన్ టీం లో స్టార్ క్రికెటర్ గా దూసుకుపోతున్న రోహిత్ శర్మ బయోపిక్‌ను తెరకెక్కించాలని.. ఎప్పటినుంచో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు భావిస్తున్నారట. అందులో భాగంగానే వాళ్లకు కనిపిస్తున్న ఒకే ఒక్క ఆప్షన్ తారక్ అని తెలుస్తుంది. బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్ని దూసుకుపోతుంటే.. జూనియర్ ఎన్టీఆర్ కోసం వీరు ఆరాటపడడానికి కారణమేంటి అనే సందేహాలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఈ క్ర‌మంలో జూనియర్ ఎన్టీఆర్‌.. రోహిత్ శర్మకు మధ్యన దగ్గర పోలికలు కనిపిస్తూ ఉండడంతో.. ఈ పాత్రకు ఎన్టీఆర్ అయితేనే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని ఎన్టీఆర్‌ను ఈ సినిమాలో హీరోగా తీసుకొని తెరకెక్కించాలని ప్లాన్ లో ఉన్నారట బాలీవుడ్ మేక‌ర్స్‌.

ఇక ఎంఎస్ ధోని బయోపిక్ ఎలాంటి గ్రాండ్ సక్సెస్ అందుకుందో.. రోహిత్ శర్మ సినిమా కూడా అలాంటి సక్సెస్ అందుకుంటుందని బాలీవుడ్ మేకర్స్ ఆశపడుతున్నారు. ఇక ప్రస్తుతం దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్న తారక్.. ప్రఆంత్ నీల్ డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత రోహిత్ శర్మ బయోపిక్ లో ఆయన నటించే అవకాశం ఉందని టాక్. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకు రాలేదు. తొందరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మేకర్స్ చేయనున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నిజంగానే రోహిత్ శర్మ లాంటి స్టార్ క్రికెటర్ బయోపిక్‌లో.. మా ఫేవరెట్ హీరో తారక్ ను చూడాలని ఆశగా ఉందంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.