కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌కు ప్రత్యేక పరిచయం అవసరంలేదు. 90లో దర్శకుడుగా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించిన శంకర్ తో సినిమా అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ పక్కాఅని నిర్మాతల్లో నమ్మకం ఉండేది. లాభాల వర్షం కురుస్తుందని నిర్మాతలతో పాటు హీరోలు కూడా శంకర్ సినిమా చేసేందుకు తెగ ఆరాటపడిపోతూ ఉండేవారు. అప్పట్లో శంకర్ తెరకెక్కించిన రేంజ్, జెంటిల్‌మెన్, జీన్స్, ఒకేఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు, బాయ్స్ ఇలా ఒక్కటేంటి తను తెరకెక్కించిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్. ఇక రజనీకాంత్ తెరకెక్కించిన రోబో సినిమా రిజల్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అయితే ఈ వైభవం అంతా గతంలో రోబో తర్వాత శంకర్ డైరెక్షన్లో వచ్చిన స్నేహితుడుతో ఆయన డబుల్ ప్రారంభమై భారతీయుడు వరకు కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయి అనడానికి శంకర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నట్లుగా మారిపోయింది. ఇప్పుడు శంకర్ తో సినిమా అంటే ప్రొడ్యూసర్లు భయపడిపోతున్నారు. శంకర్ డైరెక్షన్‌లో శివాజీ సినిమా చేసిన ఏవీఎం స్టూడియోస్ వారి నష్టాలతో దెబ్బతీసిన సంగతి తెలిసిందే. సీరియల్ షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ సినిమాలకు పూర్తిగా దూరమైంది.
ఇక విక్రం శంకర్‌ల ఐ నిర్మించిన ఆస్కార్ రవిచంద్రన్.. ఆ ఓక్క సినిమా ఫ్లాప్ తో అప్పట్లో నష్టాల్లో కూరుకుపోయాడు. ఇక విజయ్‌తో స్నేహితుడు సినిమా తీసిన జెమిని ఫిలిమ్స్ కు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఇక శంకర్‌తో రోబో 2.0, భారతీయుడు 2 సినిమాలు చేసిన లైవ్ లైకా ప్రొడక్షన్స్ అయితే దాదాపు 500 కోట్ల నష్టం జరిగింది. అనవసరమైన కంటెంట్, కథనం లోపించడం, భారీ సెట్లతో ఎక్కువగా ఖర్చు చేయడం.. ఈ కారణాలతో రిలీజ్ అయిన తర్వాత సినిమా ఫ్లాపై.. నిర్మాతలు ఆర్థికంగా నలిగిపోయారు. ఈ క్రమంలోనే శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ విషయంలోను రాంచరణ్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.