ఫుల్ స్వింగ్ లో నందమూరి హీరో.. 2023లో బాలయ్య మార్క్ 2025లో మరోసారి రిపీట్..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ స్పీడ్ అంటే ఇలానే ఉండాలి. వెళ్ళామా.. పని పూర్తిచేసామా.. వచ్చామా.. అన్నట్లే ఏదైనా ఫటా ఫట్‌గా జరిగిపోవాలి అని చెప్తూ ఉంటారు. అనడమే కాదు ఆయన ఇదే డైలార్ ప్రాక్టిక‌ల్‌గా చేసి చూపించారు కూడా. 2023 బాలయ్య కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే లక్కీ ఇయర్ అనడంలో సందేహం లేదు. గతేడాది స్టార్టింగ్‌లో వీర సింహారెడ్డితో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన ఈయన.. ఇయర్ ఎండింగ్‌లో భగవంత్ కేసరితో బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్ల‌తో దూసుకుపోతున్న బాలయ్య.. మరో పక్కన రాజ‌కీయాల్లోను విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు.

NBK109: మారణాయుధాలు మందు బాటిల్‌తో బాలయ్య.. 'వయెలెన్స్ కి విజిటింగ్ కార్డ్'  అంటూ! | Balakrishna NBK 109 Movie With Director Bobby And Poster Released -  Telugu Filmibeat

ఎమ్మెల్యే గాను ఫుల్ స్వింగ్‌లో ఉన్న బాల‌య్య ప్రస్తుతం ఆయన సినిమాల షూటింగ్ల‌లో పాల్గొంటూ సంద‌డి చేస్తున్నాడు. ఇక గ‌త కొద్ది రోజులుగా బాబి డైరుక్ష‌న్‌లో ఎన్‌బికే 109 షూటింగ్ శ‌రవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా జైపూర్లో షెడ్యూల్ పూర్తి చేసిన బాలయ్య త్వరలోనే ఈ మూవీ టైటిల్, టీజర్ అనౌన్స్ చేయనున్నారని సమాచారం. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే అఖండ సీక్వెల్ సెట్స్‌పైకి రానుంది. అయితే అంతకన్నా ముందే కుమారుడు మోక్షజ్ఞతో కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

కాగా 2023లో హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోయిన బాలయ్య నుంచి.. 2024 లో రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల ఇప్పటివరకు ఒక సినిమా కూడా రిలీజ్ కాలేదు. అయితే ఇప్పుడిప్పుడే రాజకీయాల నుంచి ఫ్రీ అయిన బాలయ్య.. మరోసారి సినిమాల‌లో బిజీ అయ్యిపోయాడు. అయితే ఈ ఏడాది బాలయ్య నుంచి సినిమాలు రిలీజ్ కాకపోయినా.. 2025 ప్రారంభం నుంచి వరుసగా.. సినిమాలు రిలీజై ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టనున్నాయి. ఈ క్రమంలో 2023లో హ్యాట్రిక్ తో దూసుకుపోయిన బాలయ్య.. మరోసారి 2025లో తన మార్క్ క్రియేట్ చేయబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ తమ ఆనందాని వ్యక్తం చేస్తున్నారు.