నాగచైతన్య – శోభితదూళిపాళ్ల ఎంగేజ్మెంట్ తర్వాత వేణు స్వామి చెప్పిన జాతకం మెయిన్ మీడియాలో, సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా చైతన్య మొదటి భార్యతో ఎలా అయితే విడాకులు తీసుకున్నాడో.. రెండో భార్యతో కూడా అలాగే విడాకులు తీసుకుని విడిపోబోతున్నాడు అంటూ వేణు స్వామి చేసిన సంచలన కామెంట్స్ నెటింట సంచలనం రేపుతున్నాయి. కేవలం వీరి మధ్య బంధం 2027 వరకే నిలిచి ఉంటుందని.. ఆ తర్వాత సలహాలు, గొడవలు ప్రారంభమవుతాయని.. వీళ్ళిద్దరికీ ఓ స్త్రీ కారణంగా గొడవలు ప్రారంభమవుతాయని.. విడాకులు తీసుకుంటారంటూ చెప్పుకొచ్చాడు వేణు స్వామి.
ఇంకా ఎన్నో షాకింగ్ విషయాలను రివిల్ చేసిన ఈ ఆస్ట్రాలజర్.. సమంత, నాగచైతన్య జంట బంధానికి 50 శాతం దృఢత్వమైన ఉందని.. కానీ నాగచైతన్య శోభితల మధ్య బంధం కేవలం 10 శాతమే నిలుస్తుంది అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. ఇక వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్న ముహూర్తం అసలు నిషేధించబడిన ముహూర్తం అని.. అలాంటి ముహూర్తంలో వీళ్లిద్దరు ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు తెలియదు కానీ.. వీరి జాతకంలో నేను చెప్పిన విషయాలు జరగకూడదని భావిస్తున్నా. నా జాతకం ఫెయిల్ అవ్వాలని.. ఈ జంట హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక తాజాగా వేణు స్వామి చేసిన కామెంట్స్ పై.. నాగచైతన్య గతంలో జాతకాలపై మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేస్తూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. గతంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య మాట్లాడుతూ.. నీకు జాతకాలపై ఎలాంటి ఒపినియన్ ఉందని రానా అడిగిన ప్రశ్నకు సమాధానంగా బ్లాస్టింగ్ సమాధానం చెప్పాడు. నాగచైతన్య మాట్లాడుతూ నమ్మడం నమ్మకపోవడం అనేది నా బెనిఫిట్ పై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నా జాతకం బాగుందని చెబితే నేను నమ్ముతా.. ఒకవేళ నా జాతకం అస్సలు బాలేదు అని చెప్పినా నేను దాన్ని పట్టించుకోను అంటూ నాగచైతన్య కామెంట్ చేశారు. ప్రస్తుతం నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ ను వేణు స్వామి జాతకం చెప్పిన వీడియోకు ట్యాగ్ చేస్తూ.. అక్కినేని ఫ్యాన్స్ తెగ ట్రోల్స్ చేసేస్తున్నారు.