రీ రిలీజ్ తో మొదటిరోజు హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన టాలీవుడ్ టాప్ 5 సినిమాల లిస్టు ఇదే..

ప్రస్తుతం టాలీవుడ్ రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసి టాప్ 5లో చేరిన సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

Murari (2001) - IMDb

మురారి:
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. సోనాలి బింద్రే హీరోయిన్గా వ‌చ్చిన‌ మురారి సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కొద్ది రోజుల క్రితం మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. ఆగస్టు 9న థియేటర్స్‌లో.. రీ రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు రూ.4.40 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డ్ సృష్టించింది.

Business Man (2012) - IMDb

బిజినెస్ మాన్:
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా తెర‌కెక్కిన మరో సినిమా బిజినెస్ మ్యాన్ పూరి జగనాథ్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా.. తాజాగా రీ రిలీజై.. మొదటి రోజు ఏకంగా రూ.4.37 కోట్లు గ్రాస్ వ‌సుళ‌ను కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు రిలీజై ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాల్లో రెండో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసుకుంది.

Kushi Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos |  eTimes

ఖుషి :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, భూమిక చావ్లా హీరోయిన్గా ఎస్. జె. సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఖుషి రిలీజ్‌లో భాగంగా ఫస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.3.62 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది.

Simhadri Movie | ఎన్టీఆర్‌ ఊరమాస్‌.. వెయ్యి స్క్రీన్‌లలో సింహాద్రి మూవీ  రీ-రిలీజ్‌-Namasthe Telangana

సింహాద్రి :
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి భారీ బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచిన మూవీ సింహాద్రి. ఇటీవల ఈ సినిమా మరోసారి రీ రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సింహాద్రి రిలీజ్ అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.2.90 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

Jalsa

జల్సా :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ జల్సా. ఈ సినిమా రిలీజై ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.2.57 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది.