చైతు – శోభితల లవ్ స్టోరీ.. షాకింగ్ సీక్రెట్స్ రివీల్ చేసిన సమంత.. !

అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితకు నిశ్చితార్థం జరిగి రెండు రోజులైనా ఇప్పటికీ టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా అదే రన్ అవుతుంది. ఇప్పటికీ ఏదో విషయమై ఈ జంట గురించి మాట్లాడుకుంటూనే ఉంటున్నారు. విరికి సంభంధించిన ప్ర‌తి వార్త నెటింట ట్రెండ్ చేస్తున్నారు. అసలు వీళ్ళు ఎప్పుడు.. ఎక్కడ.. కలుసుకున్నారు. ఎలా ప్రేమించుకున్నారు అనేది మాత్రం బయటకు రాలేదు. కానీ తాజాగా సమంత సోష‌ల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ తో ఈ విషయాలపై క్లారిటీ వచ్చేసింది.

హీరోయిన్ సమంత ఏంటి.. చైతు – శోభిత‌ల‌ లవ్ స్టోరీ గురించి రివీల్ చేయడం ఏంటి అనుకుంటున్నారా.. సమంత అంటే స్టార్ హీరోయిన్ సమంత కాదు.. శోభిత దూళిపాళ్ల చెల్లి సమంత ధూళిపాళ్ల. తాజాగా సమంత ధూళిపాళ్ల‌.. శోబిత – చైతు లవ్ స్టోరీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ రివీళ్ చేసింది. హీరోయిన్ సమంత 2017 లోనే నాగచైతన్య ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్లకే వీరు ఇష్టపడి విడాకులు తీసుకున్నారు. 2021 అక్టోబర్ 2న వీరి డివోర్స్ అయింది. దీంతో ఛై – శ్యామ్ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది.

దీని తర్వాత చైతు – సమంత ఎవ్వరికి వాళ్ళు సినిమాలు చేసుకుంటూ ఎవరి లైఫ్ణ‌/ వారు బిజీగా ఘ‌డుప‌/తున్నారు. కానీ.. శోభిత – చైతు రిలేషన్ గురించి వార్తలు వినిపించాయి. తాజాగా నిశ్చితార్థంతో అందరూ రిలాక్స్ అయ్యారు. అయితే వీళ్ళ మధ్య ప్రేమ 2022లోనే ప్రారంభమైందని.. తాజాగా శోభిత చెల్లి సమంత రివిల్ చేసింది. చైతు – శోభిత ఎంగేజ్మెంట్ ఫోటోలు పోస్ట్ చేసిన ఈ అమ్మడు.. ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. 2022లోనే సమంత ధూళిపాళ్ల షేర్ చేసిన ఓ పోస్ట్ కు చైతు లైక్ కూడా కొట్టారు. కాకపోతే ఈ విషయాన్ని ఎవరు పెద్దగా గుర్తించలేదు. ఒకవేళ సరిగ్గా గుర్తించి ఉంటే శోభితతో ప్రేమ వ్యవహారం అప్పుడే రివీల్‌ అయ్యిండేది.