సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది హీరోస్ తమ మొదటి భార్యలకు విడాకులు ఇచ్చేసి.. మరో వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా మన టాలీవుడ్ లో ఇప్పటికే నాగార్జున, పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ కృష్ణ, ఇలా ఎంతోమంది మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి వేరొక హీరోయిన్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే లిస్టులోకి తాజాగా అక్కినేని హీరో నాగచైతన్య కూడా యాడ్ అయ్యాడు. ఇక అలా మొదట పెళ్లి చేసుకున్న వ్యక్తికి డివోర్స్ ఇచ్చేసి మరొకరిని వివాహం చేసుకున్న జంటలు ఎవరో ఒకసారి తెలుసుకుందాం.
నాగచైతన్య
మొదట 2017లో స్టార్ హీరోయిన్ సమంత వివాహం చేసుకునే 2021లో ఆమెకు విడాకులు ఇచ్చారు. సమంత విడాకుల తర్వాత బోల్డ్ బ్యూటీ శోభిత ధూళిపాళ్ళను ప్రేమించిన ఈయన గురువారం తన కుటుంబ సభ్యుల సమక్షంలో శోభితను ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని కుటుంబమంతా అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
నాగార్జున
ఏఎన్ఆర్ నట వరసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున కూడా మొదట నాగచైతన్య తల్లి లక్ష్మీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య పుట్టిన తర్వాత ఏవో కారణాలతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. తర్వాత హీరోయిన్ అమలను ప్రేమించి వివాహం చేసుకున్న నాగార్జున.. అమలతో అఖిల్‌కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ది కూడా ఇదే స్టోరీ. తన మొదటి భార్య నందిని విడాకులు ఇచ్చి పవన్ తర్వాత హీరోయిన్ రేణు దేశాయ్‌న్ని ప్రేమించిన సంగతి తెలిసిందే. ఆమెను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చేసి రష్యన్ నటి అన్న లెజ్నోవాను మరోసారి వివాహం చేసుకున్నాడు పవన్. అన్నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కృష్ణ
ఒకప్పటి స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణ కూడా మొదట ఇందిరా దేవిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత.. వీరిద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. తర్వాత కృష్ణ తన కోస్టార్.. హీరోయిన్గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విజయనిర్మలను ప్రేమించి వివాహం చేసుకున్నారు.
సైఫ్ అలీ ఖాన్ :
బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌కు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ప్రభాస్ ఆది పురుష్ సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. అయితే అలీ ఖాన్ మొదట అమృత సింగ్ అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా తర్వాత ఈమె కూ డివోర్స్ ఇచ్చిన సైఫ్.. కరీనా కపూర్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. దాదాపు ఐదేళ్లు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న ఈ జంట.. 2012లో వివాహం చేసుకొని ఒకటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.