ఏజ్ పెరుగుతున్న కొద్దీ మరింత యంగ్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది సీనియర్ బ్యూటీ స్నేహ. నాలుగుపదుల వయసులోనూ తగ్గేదెలా అంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న ఏమాత్రం షేప్ అవుట్ కాకుండా ఫిట్నెస్‌ను అదే విధంగా మెయింటైన్ చేస్తూ గ్లామర్ విషయంలోనూ కుర్రాళ్ళను కవ్విస్తుంది. సావిత్రి, సౌందర్య తర్వాత పద్ధతిగా.. ట్రెడిషనల్ లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్ని హీరోయిన్గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న స్నేహ.. పిల్లలు పుట్టిన తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే ఇప్పుడిప్పుడే మరోసారి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న ఈ అమ్మడు తప్పదు అనుకుంటే క్యారెక్టర్ రోల్స్‌లోను మెప్పిస్తుంది.
ప్రస్తుతం విజయ దళపతి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం.. సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ మరోసారి సినిమాలతో బిజీ అవ్వాలని నిర్ణయం తీసుకుందట. అందుకే ఆమె కూడా హీరోయిన్ జ్యోతికలా కథలో వెయిట్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఫిట్నెస్ పై దృష్టి పెట్టిన స్నేహ.. తన బాడీ ఫిట్గా ఉంచుకునేందుకు జిమ్ లో ఎక్కువ టైం గడుపుతుంది. తాజాగా ఈమె ఎక్సర్సైజ్‌లు చేస్తున్న ఫొటోస్ నెటింట వైరల్ గా మారాయి. స్నేహ డెడికేషన్.. పనిమీద ఆమెకున్న కమిట్మెంట్, ఈ వర్కౌట్ ఫొటోస్ చూస్తుంటే అర్థమవుతుందని.. స్నేహ అందంతో పాటు తన టాలెంట్ తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫొటోస్, వీడియోస్ నెటింట తెగ వైరల్ గా మారడంతో.. వీడియోలకు లైక్ల వర్షం కురుస్తుంది. ప్రస్తుతం సినిమాల్లో ఎక్కువగా నటించకపోయినా ఈ అమ్ముడు కమర్షియల్ యాడ్స్ లో తరచు కనిపిస్తూనే ఉంటుంది. అంతేకాదు ప్రముఖ ఛానల్‌లో డ్యాన్స్ షోలోనే జడ్జిగా వ్యవహరిస్తున్న ఈ అమ్మడు.. పలు వ్యాపారాలు ప్రారంభించి బిజినెస్ రంగంలోనూ రాణిస్తుంది. సినిమాలో రీ ఎంట్రీకి బరువు తగ్గించుకోవడంతో పాటు.. స్లిమ్ గా, నాజుగ్గా కనిపించడానికి ప్రత్యేక డైట్‌ప్రస్తుతం స్నేహ ఫాలో అవుతుందని సమాచారం.