పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వి.వి.సత్యనారాయణ డైరెక్షన్‌లో తెరకెక్కిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీకి పరిచయం కావడం.. పవర్ స్టార్ మొదటి సినిమా కావడంతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో పవన్ కళ్యాణ్ మొదటి సినిమా పై, ఆయన నటనపై మంచి అంచనాలను నెలకొన్నాయి. అలా భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే పవన్ కళ్యాణ్ కు మొదట బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కింది తొలిప్రేమ సినిమాతోనే.
ఈ సినిమాకు కరుణాకరన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ క్రేజ్ తెలుగులో ఒక్కసారిగా పెరిగిపోయింది. తొలిప్రేమ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో.. ఈ సినిమాకు రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడు.. తెలుసుకోవాలని ఆసక్తి ప్రేక్షకల్లో కచ్చితంగా ఉంటుంది. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తొలిప్రేమ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే ప్రశ్నకు రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సమాధానం ఇస్తూ తొలిప్రేమ సినిమా ఓకే అయిన టైంలో నాకు ఏ మాత్రం క్రెజ్ లేదని.. దాంతో వారు నాకు కొంత మొత్తం రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పారని.. అయితే సినిమా స్టార్ట్ అయింది మేము అనుకున్న దానికంటే సినిమాకు ఇంకా ఎక్కువ బడ్జెట్ అయింది.
నిర్మాతలు సినిమా పూర్తి అయిన తర్వాత లాభాలు వస్తే రమేష్ ఇస్తామని చెప్పారు. దీంతో నేను కూడా బడ్జెట్ ఎక్కువైంది కదా.. సినిమా మంచిగా ఆడి లాభాలు వస్తే తీసుకుందాం లే అని వదిలేసా. ఇక సినిమా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దీంతో నిర్మాతలకు కూడా బాగానే లాభాలు వచ్చాయి. ఇందులో భాగంగా మొదటి నాకు ఇస్తానన్న రెమ్యునరేషన్ కూడా వారు ఇచ్చేసారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటనకు అప్పటి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. విమర్శకుల నుంచి కూడా ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు పవన్ కళ్యాణ్.