ఆ ఒక్క తప్పే ఇలియానాకు శాపం.. లేదంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్ల రేంజ్‌లో..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది గోవా సోయగం ఇలియానా. రామ్ పోతినేని హీరోగా వై.వి.ఎస్.చౌదరి డైరెక్షన్లో వచ్చిన దేవదాస్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ద‌క్కించుకుంది. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించడం పోకిరి, జల్సా, రాఖి ఇలా అన్ని సినిమాలు తెలుగులో మంచి సక్సెస్‌లు అందుకున్నాయి. దీంతో ఈమె చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్గా మారిపోయింది. చాలా కాలం పాటు తెలుగులో ఫుల్ బిజీ హీరోయిన్గా రాణించింది.

Bollywood actress Ileana D'Cruz welcomes baby boy, reveals his name |  Bollywood – Gulf News

అయితే స్టార్ హీరోయిన్గా కెరీర్ కొనసాగుతున్న సమయంలో ఈ అమ్మడు చేసిన చిన్న తప్పుతో కెరీర్ నాశనం అయింది. తమిళ్ సినీ ఇండస్ట్రీ పై ఉన్న ఇంట్రెస్ట్‌తో అక్కడ అవకాశాల కోసం టాలీవుడ్‌ను విడిచిపెట్టింది. అయితే తమిళ్ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినా.. అమ్మ‌డికి ఊహించిన సక్సెస్ అందలేదు. దీంతో పాటు తమిళ్ ఓ సినిమాకు అడ్వాన్స్ తీసుకొని సినిమా చేయకపోవడంతో ఇలియానను తమిళ్ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. అయితే అప్పటికి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఉన్నా కూడా.. తెలుగుపై కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీపై మక్కువ చూపింది ఇలియానా. ఈమె ప‌లు హిందీ సినిమాల్లో నటించిన అవి సక్సెస్ అందుకోలేకపోయాయి.

Ileana D'Cruz announces her pregnancy

దీంతో అక్కడ అమ్మడికి అవకాశాలు లేకుండా పోయాయి. అయితే తెలుగులో అద్భుతమైన క్రేజ్ ఉన్న టైంలో.. ఈమె ఇతర ఇండస్ట్రీలో అడుగు పెట్టడం.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అవకాశాలను రిజెక్ట్ చేసిందని.. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమె లైమ్ లైట్‌లో లేకుండా పోయిందని లాక‌ట్. అదే మొదటి నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ పై మాత్రమే ఫోకస్ పెట్టి ఇక్కడ సినిమాల్లోనే నటిస్తూ ఉండి ఉంటే ప్రస్తుతం ఇలియానా కూడా టాలీవుడ్ టాప్ అండ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఉండిపోయేదని ఎంతో మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలియానా టాలీవుడ్ లో చివరిగా రవితేజ హీరోగా.. శ్రీ‌ను వైట్ల డైరెక్షన్‌లో తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ నాజూకు నడుము సుందరి తర్వాత టాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా నటించలేదు.