ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.. వ్యభిచారం కేసులో చిక్కుకొని కెరీర్ నాశనం.. లేదంటే..?

చాలామంది ప్రతి ఏడాది ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా, హీరో, హీరోయిన్లుగా రాణించాలని అడుగుపెడుతూ ఉంటారు. స్టార్ హీరోయిన్గా ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశ‌లు శ్రమిస్తారు. అయితే కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న పోటీ తట్టుకోలేక.. మొదట్లోనే ఇండస్ట్రీని వదిలేస్తారు. అలా ఇప్పటికే ఇండస్ట్రీలో కాంపిటీషన్ భరించలేక.. గ‌తేడాది ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. మరి కొంతమంది వివాహాలు చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారు. కానీ.. కొంతమంది హీరోయిన్స్ కెరీర్ పిక్స్‌లో ఉన్న టైంలో చేసిన తప్పుల కారణంగా ఇండస్ట్రీకి దూరమై అంధకారంలో గ‌డుపుతున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ కూడా ఒకటి.

Kotha Bangaru Lokam Telugu Cinema 2024 | bindiproject.org

మొదట చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈ అమ్మడు.. తర్వాత హీరోయిన్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. 2002లో మాక్డి అనే సినిమాలో మొదటిసారి బాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినా శ్వేతా బసు తర్వాత పలు టీవీ షోలో కూడా నటించి మంచి క్రేజ్ దక్కించుకుంది. వరుణ్ సందేశ్ హీరోగా కొత్త బంగారులోకం సినిమాతో టాలీవుడ్ హీరోయిన్గా పరిచయం అయింది. తన మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని ఎంతో మంది కుర్రకారును ఆకట్టుకున్న శ్వేతా బసు.. తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటున్న టైంలో హైదరాబాద్ సెక్స్ రాకెట్‌లో అడ్డంగా దొరికిపోయింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది.

Yatri Kripya Dhyan De: Shweta Basu Prasad is grateful for all love pouring  in for her short with Shaheer Sheikh

2014లో ఈ అమ్మడిని సెక్స్ రాకెట్ కింద పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని నెలలపాటు రెస్క్యూ హోం లో కూడా ఈమెను ఉంచారు. తర్వాత బయటకు వచ్చిన శ్వేతా బసు ప్రసాద్ అసలు విషయాన్నీ మీడియాకు వివరించింది. ఒక ఈవెంట్ కోసం హైదరాబాద్‌కు వెళ్లాలని తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి బంధించారని చెప్పుకొచ్చింది. అయితే తర్వాత పలు సినిమాల్లో వెబ్ సిరీస్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్వేతా బసు ప్రేక్షకులను ఊహించని రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. మంచి స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత ఇలా సెక్స్ రాకెట్లో చిక్కుకోవడంతో తన కెరీర్‌కు బ్రేక్ పడింది. అయినా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ.. అభిమానులకు దగ్గరగానే ఉంటుంది శ్వేతా బసు ప్రసాద్.