నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ రెండు రోజుల క్రితమే చాలా సింపుల్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నో వేలకోట్ల ఆస్తికి వారసుడైన నాగచైతన్య ఎంగేజ్మెంట్.. ఎంత సింపుల్గా చేయడానికి కారణమేంటి.. రెండో పెళ్లి కదా అని చులకనగా చూస్తున్నారా.. లేదా దీనికి మరేదైనా కారణం ఉందా అంటూ.. నాగార్జున కుటుంబం పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. ఫ్యామిలీని ఉద్దేశించి ఎన్నో పోస్టులను చేస్తున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై నాగార్జున రియాక్ట్ అయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఎదురైన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటి.. నాగార్జున ఎలాంటి సమాధానం చెప్పాడు.. అనుకుంటున్నారా.
సమంత, నాగచైతన్య పెళ్లి అయ్యాక మూడు సంవత్సరాలు ఎంతో హ్యాపీగా ఉన్న ఈ జంట తర్వాత మనస్పర్ధలతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విడాకులు తీసుకున్న తర్వాత అటు సమంతతో పాటు, ఇటు నాగచైతన్య కూడా చాలా బాధపడ్డారట. మరి ముఖ్యంగా సమంత డిప్రెషన్ తో.. బయట వారు చేసే ట్రోల్స్ తట్టుకోలేక మయాసైటిస్ బారిన పాడిన సంగతి తెలిసిందే. ఇక నాగచైతన్య కూడా ఎవరితో మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటూ లోలోపలే ఎంతో మనోవేదనను అనుభవించాడట. తన మనోవేదన గురించి నాగార్జున రీసెంట్గా ఓ ఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
విడాకుల తర్వాత చైతు మామూలు మనిషి కావడానికి చాలా రోజులు పట్టిందని.. చాలా రోజులు తనలో తానే బాధపడుతూ ఉన్నాడంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వాడు హ్యాపీగా ఉన్నాడు. అలాగే ఎంగేజ్మెంట్ ఎందుకు అంత సింపుల్గా తొందరగా చేశారని.. హడావిడిగా ఎందుకు కానిచ్చారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఎంగేజ్మెంట్ అంత హడావిడిగా చేయడానికి కారణం నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల జాతకాలు ఆగస్టు 8న మంచి ముహూర్తం ఉందని జ్యోతిష్యుడు చెప్పడమే. దీంతో హడావిడిగా ఆ ముహుర్తానికే ఎంగేజ్మెంట్ను ఫిక్స్ చేసేసాం. మొదట్లో కొద్దిగా టైం తీసుకుని మరో మంచి రోజుల్లో ఫిక్స్ చేద్దాం అనుకున్నాం.
కానీ.. అమలా మాత్రం వాళ్ళిద్దరి జాతకాలికి ఇదే మంచి ముహూర్తం. కనుక ఇదే ముహూర్తాన్ని ఫిక్స్ చేసి ఇద్దరు ఎంగేజ్మెంట్ని పెట్టేసుకుందాం అని వివరించింది. అందుకే వారిద్దరి భవిష్యత్ బాగుండాలని ఇద్దరు జాతకాల ప్రకారం వెంటనే ముహూర్తాన్ని ఫిక్స్ చేసామని.. మరీ ఆగస్టు 8న ముహూర్తం ఫిక్స్ కావడంతో.. హడావిడి హడావిడిగా ఈ వేడుక చేయాల్సి వచ్చింది. అందుకే అంత సింపుల్ గా వీరిద్దరి ఎంగేజ్మెంట్‌ను ముగించేసామంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. రెండో పెళ్ళి అన్ని అలా సింపుల్ గా చేసుకున్నాం అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ఎంగేజ్మెంట్ తొందరగా జరిగింది. కానీ.. పెళ్ళికి మాత్రం కాస్త టైముంది అంటూ వివరించాడు. ప్రస్తుతం నాగార్జున చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవ్వడంతో.. వీరి ఎంగేజ్మెంట్ ఇంత సింపుల్‌గా హడావిడి లేకుండా జరగడానికి అమలనే కారణమా అంటూ ఆశ్చర్యపోతున్నారు.