సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది.. సెకండ్ మ్యారేజ్ కి సిద్ధమైంది అంటూ.. త్వరలోనే ఓ వ్యక్తిని వివాహం చేసుకుంటుందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందా. అయితే వార్తల్లో నిజమెంతుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. నాగచైతన్యత ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. మొదటి సినిమా షూట్ టైంలోనే ఇద్దరు మధ్య స్నేహం పుట్టడం.. తర్వాత ఇది కాస్త ప్రేమగా మారడం.. వీరిద్దరి ప్రేమ రహస్యంగా ఎన్నో ఏళ్ళు కొనసాగిన తర్వాత.. పెద్దల సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకుని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు.
ఇక వీరు కాంబినేషన్లో ఆటోనగర్ సూర్య, మజిలీ, మనం లాంటి సినిమాలు తెరకెక్కి మంచి సక్సెస్ లో అందుకున్నాయి. వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో.. ఈ జంటకు అప్పటికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే పెళ్లి అయిన నాలుగేళ్లకే వీరు అనూహ్యంగా విడాకులు తీసుకుని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. ఇక ఈ జంట విడాకుల తర్వాత ఎవరి లైఫ్ లో వారు బిజీ అయ్యారు. తాజాగా నాగచైతన్య – శోభితధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సమంత ఎంత బాధపడిందో తెలియదు గానీ.. తాజాగా సమంత తన అభిమాని పెట్టిన ఓ పోస్టుకు రిప్లై ఇవ్వడంతో.. ఆ పోస్ట్ నెటింట వైరల్‌గా మారింది.
ఇంతకి అభిమాని తన సోషల్ మీడియా ఖాతాలో ఏం పోస్ట్ పెట్టాడు.. అనుకుంటున్నారా. సమంతను ఉద్దేశిస్తూ.. నువ్వేమీ బాధపడకు.. నీకు నేనున్నాను.. మరో రెండు సంవత్సరాల్లో నేను ఆర్థికంగా స్థిరపడి ఇండిపెండెంట్ గా మారతా. మనం పెళ్లి చేసుకుందామంటూ ఓ పోస్ట్ ని షేర్ చేశాడు. అయితే ఈ పోస్ట్ నెటింట తెగ వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ చూసిన సమంత కూడా స్వీట్ గా రిప్లై ఇస్తూ.. నీ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న జిమ్ నన్ను ఎంతగానో యట్రాక్ట్ చేసి కన్విన్స్ చేసేస్తుంది అంటూ రిప్లై ఇచ్చారు. ఇది చూసిన జనం అంత ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు సమంత లాంటి పెద్ద హీరోయిన్ ఓ ఫ్యాన్ పెట్టిన పోస్ట్ కి రియాక్ట్ అవ్వడం నిజంగానే ఆనందానికి గురిచేసింది.
ఇక ఆ వ్యక్తి ఆనందాన్ని తట్టుకోలేక మళ్ళీ తిరిగి పోస్ట్ పెడుతూ.. సమంత రిప్లై నా రోజునే మార్చేసింది. సమంతకు వెయ్యి మంది ఫ్యాన్స్ ఉంటే అందులో నేను ఒక్కడిని. అలాగే వందమంది ఫాన్స్ ఉంటే అందులో కూడా నేను ఉంటా. ఒక్కరే అభిమాని అంటే ఆ ఒక్కడిని నేనే. ఒకవేళ ఎవ్వరూ లేరు అనుకుంటే అసలు నేను ఈ భూమి మీదనే లేనట్టు అంటూ సమంత పెట్టిన పోస్ట్ కి సమాధానం చెప్పాడు. ప్రస్తుతం వీరిద్దరి మధ్యన జరిగిన ఈ కాన్వర్జేషన్ నెట్టింట వైరల్ గా మారడంతో ఇది చూసిన నెటిజన్స్ అంతా చైతుకు షాకిస్తూ సమంత కూడా త్వరలోనే మరో పెళ్లితో అందరినీ ఆశ్చర్యపరుస్తుందేమో.. అతనిని సమంత పెళ్లి చేసుకుంటుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.