అక్కినేని కోడలిపై మహేష్ బాబు సెటైర్.. దెబ్బకు బ్యాక్ గ్రౌండ్ అంతా బయటకు తీసిందే..!

అక్కినేని హీరో నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత ఎంతో కాలానికి శోభితతో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఇరు కుటుంబాల సమక్షంలో చాలా సింపుల్ గా జరిగింది. ఇక శోభిత ధూళిపాళ్ల గూఢాచారి సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైన సంగ‌తి తెలిసిందే. కాగా ప్రస్తుతం శోభిత అక్కినేని కోడలు అవుతుండ‌టంతో.. ఈ అమ్మ‌డ‌ బ్యాక్గ్రౌండ్.. గతంలో శోభిత కు సంబంధించిన ప్రతి ఒక్క విషయం తాజాగా నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇందులో భాగంగా గతంలో శోభిత ధూళిపాళ్ల, సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య జరిగిన ఓ సంఘటన వైరల్ గా మారింది. ఇక శోభిత.. మహేష్ బాబు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన మేజర్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

అప్పట్లో ఈ సినిమా ప్రమోషన్స్ భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో మహేష్ బాబు, అడవి శేష్‌, శోభిత అందరూ ఒకే చోట కూర్చుని మాట్లాడుతుండగా.. మేజర్ సినిమా గురించి శోభిత ఇంగ్లీష్‌లో మాట్లాడడం మొదలుపెట్టారు. మహేష్ బాబు వెంటనే తెలుగులో మాట్లాడరా ప్లీజ్.. అంటూ సెటైరిక‌ల్‌గా కామెంట్ చేశారు. దీనికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. అయితే శోభిత దీనిపై నవ్వుతూ ఇలా రియాక్ట్ అయింది. నేను పుట్టింది తెనాలిలోనే.. కానీ తెలుగు అంత స్పష్టంగా రాదు. అంటూ కారణాన్ని వివరించింది. బ్యాక్ గ్రౌండ్ మొత్తం రివిల్ చేస్తూ.. మా అమ్మ వాళ్ళు ఊరు తినాలి. నేను పుట్టింది ఎక్కడైనా.. పెరిగింది అంతా వైజాగ్.

అక్కడే స్కూల్లో చదువుకున్న.. కాలేజ్ స్టడీ కోసం ముంబైకి వెళ్ళా. అప్పటి నుంచి ముంబైలోనే ఉన్న అక్కడే మోడలింగ్‌లో అడుగుపెట్టి ఫెమీనా మిస్ ఇండియా 2013 పోటీల్లో విజయం దక్కించుకున్నా. తర్వాత సినిమాలపై ఇంట్రెస్ట్ రావడం ఎలాంటి సపోర్ట్, ప్లాన్ లేకపోయినా సొంతంగానే ఆడిషన్స్ చేసుకుంటూ సినిమా అవకాశాలను దక్కించుకున్నా. నాకు యాక్టింగ్ చాలా నచ్చింది అంటూ శోభిత చెప్పుకొచ్చింది. కొన్ని హిందీ సినిమాలు నటించిన ఈ అమ్మడు మొదట అడవి శేష్ గూఢాచారి సినిమాలో న‌టించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ లో మరోసారి మేజర్ సినిమాలో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. అలాగే మణిరత్నం పొనియ‌న్ సెల్వ‌న్ సినిమాలోను ఓ కీలక పాత్రలో నటించింది. ప్రస్తుతం మహేష్ బాబు, శోభిత మధ్యన జరిగిన ఈ సరదా సంఘటన నెట్టింట వైరల్ గా మారుతుంది.