గూస్ బంప్స్ తెప్పిస్తున్న సూర్య ‘ కంగువ ‘ట్రైలర్..బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా(వీడియో)..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరికొత్త కాన్సెప్ట్లతో కొత్త కొత్త సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న సూర్య.. ఎప్పటికప్పుడు తన నటనతో పాటు మంచి తనంతోను లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తమిళ్ మాత్రమే కాదు తెలుగులోను మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ క్రేజీ హీరో.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. సూర్య నుంచి గతంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో కంగువ టైటిల్ తో సరికొత్త క‌థంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు సూర్య. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్ కు ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

Kanguva Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos | eTimes

ఇప్పుడు తాజాగా మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ట్రైలర్‌నే రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ విజువల్స్ తో సహా.. న‌టుల య‌క్స్‌ప్రెష‌న్స్‌ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. ప్రేక్షకులను భారీ లేబుల్ లో ఈ సినిమా మెప్పించడం ఖాయం అంటూ ప్రేక్షకుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని నెలకొల్పింది. ఈ సినిమా ట్రైలర్ తమిళ్ వర్షన్‌ను మాత్రమే యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో బాబి డియోల్ పెర్ఫార్మెన్స్ పిక్స్ లెవెల్ లో ఉంది.

Kanguva Movie Trailer Hindi | Boby Deol | Surya @filmybhai88

ఒక్కో సీన్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా విజువల్ తో అదరగొడుతున్నాయి. దాంట్లో సూర్య ఎక్స్ప్రెషన్స్ మైండ్ బ్లోయింగ్ అనడంలో సందేహం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ట్రైలర్ తోనే ప్రేక్షకుల్లో మరింత హైప్‌ను తీసుకువచ్చారు మేకర్స్. మొత్తానికి ఈ ట్రైలర్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే అధిక వ్యూస్ తో ట్రెండింగ్లో కొనసాగుతుంది. సూర్య, బాబి డ్యూయల్ మధ్య అత్యంత భారీ యుద్ధానికి సంబంధించిన సీన్స్, బ్యాగ్రౌండ్ విజువల్స్ అయితే వేరే లెవెల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా అంటూ సినిమా హిట్ అయ్యిన‌టే అంటూ కామెంట్లు వ్య‌క్తం అవుతున్నాయి. సినిమా రిలీజై ప్రేక్షకుల్లో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.