టాలీవుడ్ ఇండస్ట్రీకి మూల స్తంభాలుగా నిలిచిన ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలో నటించేటప్పుడు ఎంత ఐక్యమత్యంగా ఉండే వాళ్ళు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరు సినిమాల్లో ఒకరు గెస్ట్ రోల్ లో నటిస్తూ.. మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూ.. ఎవరి సినిమాకు సహాయం కావాలన్నా ఇంకొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండేవాళ్లు. అలాంటి నందమూరి, అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన నెక్స్ట్ తరం వారసులు.. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న బాలకృష్ణ, నాగార్జున మధ్య మాత్రం ఎన్నో సంవత్సరాల నుంచి విభేదాలు ఉన్నాయంటూ.. ఎప్పటికప్పుడు మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక వాటికి ఆద్యం పోస్తూ నాగార్జున తండ్రి అక్కినేని నాగవేశ్వరరావు చనిపోయిన సమయంలో కూడా సినీ పరిశ్రమ అంతా హాజరై ఆయనకు సంతాపం తెలియజేసినా.. బాలయ్య మాత్రం అక్కడికి వెళ్ళలేదు.
ఈ నేపథ్యంలో అప్పట్లో బాలయ్య, నాగార్జున మధ్య ఆరెంజ్‌లో విభేదాలు ఉన్నాయంటూ వార్తలు తెగ వినిపించాయి. అందుకు కారణం ఏమిటనే విషయం మాత్రం బయటకు రాలేదు. సినీ పెద్దలు పలువురు వీరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి ఏవి ఫలించలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బాలయ్య, నాగార్జున మధ్య సఖ్యత కుదుచ్చేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించారని.. వారి ప్రయత్నం సక్సెస్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అతను ఎవరు.. వారిద్దరి మధ్య ఎలా విభేదాలు తొలిగిపోయాయో ఒకసారి తెలుసుకుందాం. వీరిద్దరి మధ్యన సఖ్యత కుదిరిచిన ఆ వ్యక్తి ఇద్దరికీ ఆత్మీయుడైన వ్యక్తి అట. వీరిద్దరి మధ్యన సఖ్యత కుదిర్చేందుకు అతను విశ్వప్రయత్నం చేసి మరి చివరకు కలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బాలయ్య హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో మూడో సీజన్ అక్టోబర్‌లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ షోకు సినీ ప్రముఖుల అందరిని ఆహ్వానించే ఆలోచనలో బాలయ్య ఉన్నాడు. నాగార్జున ప్రస్తుతం ధనుష్ తో కలిసి కుబేర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి శేఖర్‌ఖమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే కుబేర బృందం మొత్తం అంత.. బాలయ్య షోకు హాజరుకానుంది. ఇక వీరందరితోపాటు నాగార్జున కూడా కుబేర సినిమా ప్రమోషన్స్ కోసం అన్‌స్టాపబుల్‌కు వస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి కొన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసిపోవడంపై నందమూరి అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక నాగేశ్వరరావు నివాళిని అర్పించడానికి అప్పుడే బాలయ్య వెళ్లి ఉంటే ఇంకా బాగుండేది అంటూ.. కొద్ది కాలం ముందే ఈ పరిణామం జరిగి ఉంటే బాగుండేది అంటూ చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సీజన్లో మరో ఎపిసోడ్ కోసం చిరంజీవి కూడా స్పెషల్ గెస్ట్ గా రానున్నట్లు సమాచారం. కాగా మొదట ఏ హీరో ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమోన్ విడుదల చేస్తారో వేచి చూడాలి. బాలయ్య – నాగార్జున మధ్య రాయభారం నడిపిన వ్యక్తి ఎవరో అనే దానిపై మాత్రం ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. అయితే ఆ వ్యక్తి పూర్తిగా వీరిద్దరి ఆత్మీయుడని.. ఆయన మాటకు ఇద్దరు ఎంతగానో గౌరవం ఇస్తారని.. అందుకే ఆయన మాటను కాదనలేక గొడవలు మరిచిపోయి ఇద్దరు కలిసిపోయారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.