టాలీవుడ్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా స్టార్ హీరోగా రాణిస్తున్న సెలబ్రిటిలకు సంబంధించిన ఏ ఒక్క చిన్న విషయం బయటకు వచ్చిన అది తెలుసుకోవాలని ఎంతోమంది ప్రేక్షకులు ఆసక్తి చూపుతూ ఉంటారు. అభిమానులు ఇలాంటి క్రమంలో మన టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి, వెంకటేష్, మహేష్ నుంచి ఎన్టీఆర్, చరణ్ వరకు తమ పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం నటించిన సినిమాలు ఏవో.. ఆ సినిమాల రిజల్ట్స్ ఎలా వచ్చాయో ఒకసారి తెలుసుకుందాం.
వెంకటేష్
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పెళ్లి తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆయన ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మొదటి సినిమా కలియుగ పాండవులు. 1985లో వెంకటేష్ వివాహం జరగగా.. వెంకటేష్ డెబ్యూ మూవీ 1986లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
బాలకృష్ణ
నటసింహం బాలకృష్ణ – వసుందరల వివాహం 1982లో జరిగింది. పెళ్లి తర్వాత బాలయ్య నటించిన మొదటి సినిమా సింహం నవ్వింది. ఈ సినిమాలో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి నటించిన ముప్పించారు. ఇక పెళ్లి తర్వాత బాలయ్య సోలోగా నటించిన మొదటి మూవీ సాహసమే జీవితం. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల్లో మంచి సక్సెస్ అందుకున్నాయి.
చిరంజీవి
1980 ఫిబ్రవరి 20న చిరంజీవి.. సురేఖల వివాహం జరిగింది. వీరిద్దరి వివాహం జరిగిన మరుసటి రోజు ఫిబ్రవరి 21వ చిరంజీవి హీరోగా నటించిన అగ్ని సంస్కారం సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా చిరు కెరీర్ లోనే ఎంతో స్పెషల్ గా నిలిచిపోయింది.
ఎన్టీఆర్
నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల వివాహం 2011లో జరిగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పెళ్లి తర్వాత రిలీజ్ అయిన సినిమా ఊసరవెల్లి. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఏ సినిమా ఊహించిన రెంజ్‌లో సక్సస్ అందుకోకపోయినా.. తారక్ ఫ్యాన్స్ కు మాత్రం మంచి ట్రీట్ ఇచ్చింది.
మహేష్ బాబు
నమ్ర త శిరోథ్కర్ – మహేష్ బాబు 2005 లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు పెళ్లి తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ అతడు. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా సినిమాల లిస్టులో ఒకటిగా నిలిచింది.
రామ్ చరణ్
మెగా వారసుడు రామ్ చరణ్ – ఉపాసన ని 2012లో వివాహం చేసుకున్నారు. చరణ్ వివాహం తర్వాత రిలీజ్ అయిన మొదటి సినిమా నాయక్. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.
అల్లు అర్జున్
అల్లుఅర్జున్ – స్నేహా రెడ్డి 2011 మార్చి 6న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. బన్నీ పెళ్లి తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా బద్రీనాథ్. ఈ సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేదు.
నాగార్జున
నాగార్జున పెళ్లి తర్వాతే హీరోగా మారారు. 1984లో దగ్గుపాటి లక్ష్మీని వివాహం చేసుకున్న నాగార్జున.. విక్రమ్ సినిమాతో తన కెరీర్ ప్రారంభించారు. ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది. ఇక తర్వాత లక్ష్మితో విడాకులు తీసుకున్న నాగ్.. అప్పటి హీరోయున్ అమలను రెండో వివాహం చేసుకున్నారు. అమలన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నాగార్జున నటించిన మొదటి సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది.