భారతదేశం తెలుగుదనానికి.. సాంప్రదాయ, సంస్కృతికి పెట్టింది పేరు. ఇక భారత దేశంలో ఇప్పటికే ఎన్నో ఆధ్యాత్మిక సాంస్కృతిక దేవాలయాల కొలువు దీరిన సంగతి తెలిసిందే. అయితే భారతదేశంలో ఉన్న దేవాలయాలు అత్యధిక ఆదాయాన్ని గణిస్తున్న దేవాలయాలు ఏవి.. ఇండియాలో రిచెస్ట్ దేవాలయాల వివరాల గురించి ఒకసారి తెలుసుకుందాం.
తిరుమల తిరుపతి:
ఇండియాస్ రిచెస్ట్ చెస్ టెంపుల్స్ అనగానే మొదట గుర్తుకు వచ్చేది తిరుపతి. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన ధనిక దేవాలయంగా గుర్తింపు సంపాదించుకుంది. తిరుమల కొండలు నడుమ 16 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ దేవాలయం పదవ శతాబ్దంలో నిర్మించారు. ఇక తిరుమల ఏడాది ఆదాయం రూ.1500 కోట్లు నుంచి రూ.3 లక్షల కోట్ల నికర విలువలు కలిగిన ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయాల్లో ఒకటిగా నిలిచింది. ఇక విలువైన కానుకలు, భక్తుల మొక్కుబళ్ళు వెంట్రుకలు, ఫిక్స్ డిపాజిట్‌ల పై వడ్డీ.. మొత్తం వివిధ టిటిడి ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు విరాళాలుగా వందల కోట్ల రూపాయల ఆదాయం వెళ్తుంది.
పూరి జగన్నాథ టెంపుల్:
ఒడిస్సాలో కొలువుతీరిన పూరి జగన్నాథుడి ఆలయం కూడా భారతదేశంలోనే రిచెస్ట్ దేవాలయాల్లో ఒకటిగా కొలువు తీరింది. ఇటీవల ఈ గుడిలో ఉన్న రహస్య గదుల ద్వారా మరింత విలువైన సంపదను బయటకు తీయడం విశేషం. అంతేకాదు లోపల తెరవాల్సిన గదులు ఇంకా ఉన్నట్లు సమాచారం. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయానికి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రత్యేకతలు ఉండడం విశేషం. నిత్యం వేల మంది దర్శించుకునే ఈ దేవాలయానికి వందల కోట్ల స్థిరాస్తులతో పాటు 30 వేల ఎకరాల భూమి కూడా ఉందని సమాచారం.
అనంత పద్మనాభ స్వామి టెంపుల్:
కొద్ది ఏళ్ళ క్రితం తవ్దిన నేల మాలిగల ద్వారా వేలకోట్ల సంపాదన కలిగి ఉన్న దేవాలయంగా ప్రసిద్ధి చెందింది కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం. తిరువనంతపురం దగ్గరలో గల ఈ ఆలయం.. లక్ష ఇరవై వేల కోట్ల ఆస్తులతో ప్రపంచంలోనే అత్యధిక ధనిక దేవాలయంగా పేరు సంపాదించుకుంది. బంగారు విగ్రహాలు, వజ్రాలు, వెండి, పచ్చలు, పురాతన వస్తువులు ఇలా కోట్ల సంపాదన ఈ దేవాలయం నేలమాలిగల్లో దాచి ఉంచారు. కొంతవరకు బయటకు తీసిన ఇంకా కొన్ని గదులు అలాగే ఉన్నాయి. ఈ గదులకు నాగబంధం ఉండడంతో వాటిని తీయడానికి పండితులతో పాటు శాస్త్రవేత్తలు వెనుకడుగు వేస్తున్నారు.
గోల్డెన్ టెంపుల్:
పంజాబ్ రాష్ట్రంలో అమృత్‌సర్ పట్టణంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ కూడా భారతదేశంలోని దానికి దేవాలయాల్లో ఒకటిగా పేరు కాంచింది. 400 కిలోల బంగారంతో ఈ దేవాలయ తాపడాన్ని చెక్కించారు. అందుకే దీన్ని గోల్డెన్ టెంపుల్ గా పిలుస్తూ ఉంటారు. ఈ గుడి వార్షిక ఆదాయం రూ.500 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఐదవ సిక్కు గురువు గురు అర్జున్ సాయంతో ఈ మందిరాన్ని నిర్మించారు. గురునానక్ ఇక్కడ ఆలయాన్ని నిర్మించక ముందు ధ్యానం చేసేవారని.. 1581లో ఈ దేవాలయం నిర్మాణం ప్రారంభించి 8 ఏళ్లకు పూర్తి చేశారని ఇక్కడ వారు చెబుతూ ఉంటారు.
షిరిడి:
లక్షలాది మంది భక్తితో కొలిచే షిరిడి సాయిబాబా వారి ఆలయం కూడా భారతదేశంలో ధనిక ఆలయాల్లో ఒకటి. మహారాష్ట్ర శిరిడి సాయిబాబా ఆలయానికి ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాదిమంది భక్తులు దర్శనానికి వెళుతూ ఉంటారు. రోజుకి 30 వేలకు పైగా భక్తులు సాయిబాబాని దర్శించుకుంటారు. 1922లో నిర్మించిన ఈ ఆలయానికి వార్షిక ఆదాయం కోట్లలో ఉంటుంది. సాయిబాబా వారి కూర్చున్న సింహాసనమే దాదాపు 100 కిలోల బంగారంతో చేయబడిందని సమాచారం. 100 కోట్ల విరాళాలు, నగదు, చెక్కులు, బంగారం ఇతర ఆదాయాలు చూసుకుంటే 500 కోట్లకు పైనే దేవాలయం ఆదాయం ఉంటుందని అంచనా. ఇక ఆలయ ట్రస్ట్ ద్వారా సేవలు కూడా అందుబాటులో ఉంటూనే ఉంటాయి. రెండు ఆసుపత్రులను నిర్వహించడంతోపాటు.. ప్రతిరోజు దాదాపు లక్ష మంది భక్తులకు అన్న సమారాధన అందిస్తూ ఉంటారు షిరిడి ట్రస్ట్.
గుజరాత్ సోమనాథ్ టెంపుల్:
గుజరాత్ లోని సోమనాథుని ఆలయం కూడా అత్యంత సంపద కలిగిన దేవాలయాల్లో ఒకటి. భారతదేశంలోని 12 పవిత్ర జ్యోతిర్లింగాలలో ఈ సోమనాథ లింగమే మొట్టమొదట ఉద్భవించిన ప్రదేశంగా స్థల పురాణాలు చెబుతున్నాయి. ఆలయానికి ఎంత సంపద ఉంది అనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేనప్పటికీ.. 300 కిలోల బంగారం, వివిధ రూపాల్లో మరింత ఆదాయం ఉన్నట్లు సమాచారం. 170 ఎకరాల భూమితో సహా ఎన్నో రూపాల్లో ఆస్తులను ఈ దేవాలయం కలిగిఉందట.
వైష్ణో దేవి టెంపుల్ :
హిందువులు ప్రధాన పుణ్యక్షేత్రంగా భావించే వైష్ణో దేవి టెంపుల్ కూడా రిచెస్ట్ దేవాలయాల్లో ఒకటి. 5,200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం వైష్ణో దేవిగా పూజించబడే దుర్గామాతకు అంకితం చేయబడింది. 108 శక్తి పీఠాలలో ఒకటిగా దీనిని పరిగణిస్తారు. భారతదేశంలో అత్యధిక ధనిక దేవాలయాల్లో ఒకటిగా ఉన్నాయి. ఆలయాన్ని రెండు దశాబ్దాలలో.. 1800 కిలోల బంగారం, 4700 కిలోల వెండి మరియు రెండువేల కోట్ల నగదు విరాళాల రూపంలో వచ్చినట్లు సమాచారం.
ముంబై సిద్ధి వినాయక టెంపుల్:
ముంబైలో ఎంతో ప్రసిద్ధిగాంచిన సిద్ధి వినాయక దేవాలయం రెండు శతాబ్దాల నాటి ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఇది కూడా భారతదేశంలో అత్యధిక ధనిక దేవాలయాల్లో ఒకటిగా పేరుగాంచింది. ప్రధాన మూల విరాట్‌కు నాలుగు కిలోల బంగారు నగలు ఉన్నాయి. ఆలయానికి రూ.125 కోట్ల ఆస్తులు ఉన్నట్లు సమాచారం. రోజువారి ఆలయానికి రూ.30 లక్షల ఆదాయం వస్తుందని తెలుస్తుంది. ఇక్కడ కొలువైన గణనాథుడు విశిష్ట లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ వినాయకుడికి తొండం కుడి వైపుకు వంగి ఉన్నట్లుగా కనిపిస్తుంది. విగ్రహానికి నాలుగు చేతులు ఉంటాయి.