ఈ హీరో భార్య, కూతురు ఇద్దరూ స్టార్ హీరోయిన్సే.. బాలయ్యతో నటించి బ్లాక్ బస్టర్ కొట్టారు..!

ఈ పై ఫోటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా.. ఆయన ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక చివరిగా టాలీవుడ్ లో ఆర్ఎక్స్ 100 సినిమాల్లో డాడీ పాత్రలో నటించి మంచి క్రేజ్ ద‌క్కించుకున్నాడు. అజయ్ భూపతి డైరెక్షన్లో తెర‌కెక్కిన ఆర్ఎక్స్ 100 సినిమాలో పెళ్లి చేసుకోకుండా తిరుగుతూ కుర్రాళ్లకు పెద్దదిక్కుగా ఉంటాడు. రామ్‌కి సినిమాలో ఆయన పాత్ర ప్రేక్షకులను మెప్పించింది. ఇక రామ్‌కీ పూర్తి పేరు రామకృష్ణ. ఒకప్పుడు రామ్‌కి హీరోగా నటించిన సినిమాల్లో ఘటన, భలే ఖైదీలు, దోషి లాంటి సినిమాలు ఉన్నాయి. ఇక విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన ఒసేయ్ రాములమ్మలోను ఓ చిన్న పాత్రలో నటించి మెప్పించాడు.

ఈ హీరో భార్య, కూతురు ఇద్దరు కూడా స్టార్ హీరోయిన్స్ తో సినిమాల్లో నటించి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్లు అందుకున్నారు. ఇంతకీ అతని భార్య, కూతురు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆయన భార్య ఓ హీరోయిన్. ఒకానొక టైంలో స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ అమ్మడు వరుస సినిమాలో నటించింది. ఆమె పేరే నిరోష. రామ్‌కీ – నిరోషా కలిసి సింధూరపువ్వు సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా టైంలో ఏర్పడిన పరిచయంతో నిరోషా.. రామ్ కి ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. ఇక నిరోషా.. బాలకృష్ణ, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, మోహన్ బాబు లాంటి ఎంతోమంది స్టార్ హీరోలతో నటించి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. బాలయ్యతో నిరోషా నారి నారి నడుమ మురారి సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.

తెలుగులో దాదాపు 30 కి పైగా సినిమాలో నటించిన ఈ అమ్మడు.. తమిళ్లో ఎక్కువ సినిమాల్లో నటించింది. దాదాపు 100 సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఈ ముద్దుగుమ్మ 1995లో రామ్‌కిని వివాహం చేసుకుంది. ఇక రాంకీ అన్న ఎవరో కాదు.. సీనియర్ హీరో శరత్ కుమార్.. ఇయ‌న‌ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తో దూసుకుపోతుంది. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ప‌లు సినిమాల్లో నటిస్తున్న‌ ఈ అమ్మడు బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇక వరుసకు రాంకీకి.. వరలక్ష్మి శరత్ కుమార్ కూతురు అవుతుంది. అలా రాంకి భార్య, కూతురు ఇద్దరు బాలకృష్ణతో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ లు తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా కొంతకాలం క్రితమే నిరోషా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. రాంకీ కూడా ప్రస్తుత ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.