సుమపై సీరియస్ అయినా హీరో రవితేజ.. డైరెక్టర్ షాకింగ్ పోస్ట్ వైరల్.. !

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్టు 15న ప్రేక్షక ముందుకు రానున్న సంగతి తెలిసిందే. హరిష్‌శంకర్ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా యాంకర్ సుమకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. అయితే సుమ ఈ ఇంటర్వ్యూలో భాగంగా ర‌వితేజ‌పై ఇంట్రెస్టింగ్ క్యూస్షన్స్ సందించింది.

వింటేజ్ రవితేజను మిస్టర్ బ‌చ్చ‌న్‌లో చూస్తారంటూ హరీష్ శంకర్ చెప్పారు కదా.. ఎలాంటి వింటేజ్.. వెంకీ లాంటిదా, విక్రమార్కుడు లాంటిదా, ఇడియట్ లాంటి వింటేజా.. ఎలా మేము రవితేజను చూడగలం అంటూ సుమ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు రవితేజ స్పందిస్తూ.. హరీష్ శంకర్ వింటేజ్‌ అంటూ రియాక్ట్ అయ్యారు. వెంటనే సుమ మాట్లాడుతూ అదే హరిష్‌ శంకర్ డైరెక్షన్లో రెండు సినిమాలు వచ్చాయి కదా.. షాక్‌, మిరపకాయ ఇందులో ఏ వింటేజ్ అంటూ ప్రశ్నించింది.

దానికి రవితేజ సమాధానం చెప్తూ.. మిరపకాయ్ అంటూ చెప్పుకొచ్చాడు. అదిగో మళ్ళీ దీనికి వన్ వర్డ్‌ ఆన్సర్ ఇచ్చారు అంటూ సుమ.. రవితేజ పై కాస్త టోన్ పెంచింది. దీంతో రవితేజ అంటే ఏంటి ఇప్పుడు.. మొత్తం మిరపకాయ కథ చెప్పేయాల ఏంటి అంటూ పంచ్ వేసాడు. వెంటనే సుమా అదిగో ఇక వేసుకోండి రా.. తంబ్ నెయిల్స్‌.. సుమ‌పై సీరియస్ అయినా రవితేజ.. వేసుకోండి అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా హరిష్ శంకర్ పోస్ట్ చేస్తూ.. సుమ మీద సీరియస్ అయినా రవితేజ అంటూ ట్విట్ చేశాడు. ప్రస్తుతం హరీష్ శంక‌ర్‌ చేసిన ఈ పోస్ట్ నెటింట తెగ వైరల్ గా మారింది.