ఆ హీరోయిన్ కోసమే చైతన్య, శోభిత విడిపోతారని చెప్పా.. వేణుస్వామి..

తెలుగు స్టార్ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో పరిచయం అవసరం లేదు. ఎప్పటి నుంచో స్టార్ సెలబ్రేలు, రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ పాపులారిటి దక్కించుకున్న వేణు స్వామి.. చివరిగా రాజకీయాల్లో చెప్పిన జోష్యం తప్పు కావడంతో గత కొద్దికొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మళ్లీ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాడు వేణు స్వామి. ఏపీ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత నేను ఇప్పటినుంచి రాజకీయాలు, సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలను చెప్పనని వివరించిన ఈయన.. తాజాగా నాగచైతన్య, శోభిత‌ ధూళిపాళ్ల జాతకం చెప్పి మళ్ళీ తీవ్రమైన ట్రోల్స్ కు గురవుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా తను ఓ హీరోయిన్ కోసమే వీరిద్దరి జాతకం చెప్పాల్సి వచ్చింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు వేణు స్వామి.

వేణు స్వామి మాట్లాడుతూ నేను సమంత, నాగచైతన్య జాతకం అప్పట్లో వివరించా. దానిని కొనసాగింపుగా శోభిత, నాగచైతన్య జాతకం ఎలా ఉంటుందో చెప్పాల్సి వచ్చింది. అంతేకానీ.. ఇచ్చిన మాట తప్పాల‌ని కాదు. నేను సెలబ్రిటీలకు సంబంధించి, రాజకీయ నాయకులకు సంబంధించి ఎలాంటి పర్సనల్ విషయాలను బహిరంగంగా చెప్పనంటూ వివరించాడు. దానికి ఇష్టపడి.. కట్టుబడే ఉన్నానని. తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా నాకు ఫోన్ చేసి ఈ విషయం గురించి వివరణ అడిగారంటూ చెప్పుకొచ్చాడు. ఆయనతో కూడా నేను ఇదే విషయాన్ని వివరించాన‌ని.. సమంత జాతకానికి కంటిన్యూ గానే వీరిద్దరి జాతకం కూడా చెప్పుకొచ్చానని.. నేను ఇచ్చిన మాటకు కట్టుబడే ఉన్నానంటూ ఆయనతో చెప్పానని వివరించాడు. ఇప్పటినుంచి సెలబ్రిటీలు ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చి జాతకాలు చెప్పమని అడగవద్దు.. నేను సెలబ్రిటీల జాతకాలు చెప్పడం మానేస్తున్న అంటూ.. మంచు విష్ణు తో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయాన్ని వివరించానంటూ చెప్పుకొచ్చాడు.

Venu Swami: చేరాల్సిన చోటే చేరుతున్నాడు.. వేణు స్వామికి బంపర్ ఆఫర్ - NTV  Telugu

ఇక మంచు విష్ణు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నాడని.. ఎప్పటికైనా సరే ఇదే మాటకు నేను కూడా కట్టుబడి ఉంటాను అంటూ వేణు స్వామి మాట్లాడిన వీడియోను నెటింట‌ షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం వేణు స్వామి మాట్లాడిన వీడియో నెటింట‌ వైరల్‌గా మారడంతో ప్రతిసారి ఇదే మాట చెబుతావు.. మళ్ళీ సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడం కోసం ఏదో ఒక సెలబ్రిటీ వ్యక్తిగత విషయాలను బహిరంగ మాట్లాడుతూ వారి ప్రైవసీని డిస్టర్బ్ చేస్తూ ఉంటావు.. అంటూ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా నువ్వు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటే అందరికీ ప్రశాంతంగా ఉంటుంది. లేదు మరెవరైనా సెలబ్రిటీల విషయంలో జాతకం అంటూ మొదలు పెడతావ్ అంటూ.. జనం వేణు స్వామి పై ఫైర్ అవుతున్నారు. ఇక ఈ సరైన వేణు స్వామి చెప్పిన మాట నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.