నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. కే.ఎస్. బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే బాలయ్య అఖండ 2ని సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట. బోయపాటి శ్రీను ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్కిప్ట్‌ని కూడా లాక్ చేశారని.. అఖండ2 కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇయర్ ఎండింగ్లో సెట్స్ మీదకు వెళుతున్న అఖండ 2 కాస్టింగ్ గురించి.. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ గురించి.. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి నుంచి అఖండ 2ను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
దానికి తగ్గట్టుగానే కాస్టింగ్ ఉండబోతుందని సమాచారం. ఇందులో భాగంగా బాలయ్యకు విలన్ గా బాలీవుడ్ యాక్షన్ స్టార్ సంజయ్ దత్ ను తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పూరి.. డబ్బులు ఇస్మార్ట్ లో సంజయ్ దత్త్‌ను విలన్గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక బాలకృష్ణ నెక్స్ట్ రాబోతున్న అఖండ2 సినిమాలో కూడా సంజయ్ దత్ విలన్ గా సిద్ధమవుతున్నాడట. అంతే కాదు అఖండ2లో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ ని తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని టాక్ నడుస్తుంది. బాలకృష్ణతో కత్రినా కైఫ్ 20 ఏళ్ల క్రితం అల్లరి పిడుగు సినిమాలో నటించి మెప్పించింది. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబో అఖండ 2 కోసం నటించబోతున్నారట. ఈ కాంబో రిపీట్ అయితే సౌత్ తో పాటు నార్త్ లో కూడా అఖండపై మంచి హైప్ ఏర్పడుతుంది అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్ నడుస్తుంది. ఇక మ్యారేజ్ తర్వాత కత్రినా కైఫ్ గ్లామర్ షో కి దూరమైన సంగతి తెలిసిందే.
కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకుంటున్న ఈ అమ్మడు.. అఖండ 2లో గ్లామర్ పరంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మల్లీశ్వరి, అల్లరి పిడుగు ఇలా రెండు సినిమాల్లో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. మళ్ళీ తెలుగు ఆడియన్స్ ముందుకు బాలయ్య జంటగా రానుందని తెలియడంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందని వ్యక్తం చేస్తున్నారు. అఖండ టు పై ఇప్పటికే నందమూరి అభిమానులతో పాటు.. సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాను తీయబోతున్నారని సమాచారం. బాలీవుడ్ నటినటులు కూడా ఇందులో భాగం కాబోతున్నారట. కనుక పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా క్రేజ్ వేరే లెవెల్ లో ఉండనుందని అకండ 2 మ్యాజిక్ విషయంలో బోయపాటి నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ కూడా ప్రకటించే అవకాశం ఉందని.. ప్రకటించిన రిలీజ్ డేట్ కు తప్పకుండా జెట్ స్పీడ్‌లో సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేసేలా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.