బాల‌య్య తాత‌మ్మక‌ల సినిమా స్పెషాలిటీ తెలుసా.. ఇంత హిస్ట‌రీ ఉందా..?

నందమూరి తారక రామారావు నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ.. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలలో నెంబర్ వన్ పొజిషన్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరస హీట్లతో యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తే దూసుకుపోతున్న బాలయ్య.. సీనియర్ స్టార్ హీరోలలో నెంబర్ వన్ పొజీష‌న్ సొంతం చేసుకున్నారు. తారక రామారావు తనయుడుగా పుట్టడం బాలకృష్ణ అదృష్టం అయితే.. మరో రకంగా ఆయనకు అగ్నిపరీక్ష అనడంలో సందేహం లేదు. తండ్రి పేరు నిలబెడుతూ విజయాలను సాధించి.. తండ్రికి తగ్గ తనయుడిగా క్రియేట్ చేసుకోవడం అంటే సాధారణ విషయం కాదు. ఈ విషయంలో బాలయ్య సక్సెస్ అందుకున్నాడు.

సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఇదే రోజున తాతమ్మకల సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బాలయ్య. సాధారణంగా ఎవరైనా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 30,40 ఏళ్ళు కాగానే వారు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మాత్రమే పరిమితమైపోతారు. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 ఏళ్ళు పూర్తయినా.. ఇప్పటికీ బాలయ్య హీరోగా దూసుకుపోతున్నాడు. తాతమ్మ కల సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క ఏడాది కూడా గ్యాప్ తీసుకోకుండా హీరోగా నటించాడు బాలయ్య. ఈ క్రమంలో సెప్టెంబర్ 1న సౌత్ సినీ ఇండస్ట్రీలో అతిరథ మహారాధులు సమక్షంలో ఆయనకు గ్రాండ్ లెవెల్ లో సన్మానం జరుగుతుంది.Nandamuri Balakrishna : బాల‌కృష్ణ సినీ ప్రస్థానానికి 46 ఏళ్ళు.. | nandamuri  balakrishna completed 46 years for industryఇక బాలయ్య 50 సంవత్సరాల సినీ ప్రస్థానం పూర్తయిన సందర్భంగా.. బాలకృష్ణ మొదటి సినిమా తాతమ్మకలకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు వైర‌ల్‌గా మారుతున్నాయి. అవి ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. బాలకృష్ణ నటించిన తాతమ్మకల సినిమాకు కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. కుటుంబ నియంత్రణ విధానాన్ని మొదటిసారి దేశంలో ప్రవేశ పెట్టిన క్రమంలో ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ సీనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా 50 రోజుల నిరంతరాయంగా ఆడిన తర్వాత సినిమాను ఆపేసి చిన్న చిన్న మార్పులతో మళ్ళీ రిలీజ్ చేశారు. రెండు సార్లు సెన్సార్ అయ్యి.. రెండు సార్లు రిలీజ్ అయిన తెలుగు సినిమా ఇదొక్కటే కావడం విశేషం. ఇక ఇందులో బాలకృష్ణది బాల నటుడు పాత్రే కాదు.. కథలో ఓ కీలకమైన పాత్ర బాలయ్యది.