ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న అల్లు అర్జున్.. ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు దక్కించుకుని రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు బాలీవుడ్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈక్రమంలో అల్లు అర్జున్ దీనికి సీక్వల్ గా పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.
రష్మిక మందన ఈ సినిమాలో సరికొత్త లుక్ తో మరోసారి ప్రేక్షకులముందుకు రానుంది. ఇక మొదటి పార్ట్ భారీ సక్సెస్ అందుకోవడంతో.. ఈ సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్లు మేకర్స్ షురూ చేసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఓటిటి హిందీలో రికార్డ్ బిజినెస్ జరిగిందని టాక్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బిజినెస్ కూడా మొదలైపోయాయట. ఈ సినిమా ఒక ఏపీలోనే భారీ లెవెల్ లో బిజినెస్ జరుపుకుంటుందని టాక్. ఒక ఆంధ్ర మొత్తంలోనే పుష్ప 2కు మేకర్స్ ఏకంగా రూ.90 కోట్ల వరకు బిజినెస్ కోడ్ చేసినట్లు సమాచారం.
మరి ఏపీలోనే ఇంత బడ్జెట్ అంటే.. నైజాం మార్కెట్‌లో కచ్చితంగా దీని కంటే ఎక్కువ.. లేదా దీనితో సమానంగా బిజినెస్ జరుగుతుందనడంలో సందేహం లేదు. ఇలా రికార్డు లెవెల్ లో బిజినెస్‌తో పుష్ప రాజ్ తగ్గేదేలే అంటూ ర్యాంపేజ్ చూపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమా రూపొందుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 6న గ్రాండ్ లెవెల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఏదైనా తాజా అప్డేట్ వస్తే బాగుంటుందంటూ.. అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.