మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన చివరి మూవీ మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్యన రిలీజై డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ టాక్ రావడంతో సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. అయితే గతంలో రవితేజ నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిలో ఆయన నటించిన ఆంజనేయులు సినిమా కూడా ఒకటి.
ఈ సినిమా అపట్లో మంచి సక్సెస్ అందుకుంది. పరశురామ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో.. నయనతార హీరోయిన్గా నటించి మెప్పించింది. ప్రకాష్ రాజ్, సోను సూద్, సుబ్రహ్మణ్యం, మాళవిక కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు.. థమన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బండ్ల గణేష్ ప్రొడ్యూసర్గా తెరకెక్కిన ఈ సినిమా కు సంబంధించిన పై ఫోటోపై ఓ లుక్ వేయండి. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో కనిపించే సీన్ ఇది. ఈ సీన్లో ఉన్న కెమెరామెన్‌ను గుర్తుపట్టారా.. అతను ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. రౌడీ హీరోగా మంచి ఇమేజ్ సంపాదించుకుని హిట్లు , ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు.
ఇంతకీ ఈయన ఎవరో గుర్తుపట్టారా.. ఆ రౌడీ హీరో మరెవరో కాదు విజయ్ దేవరకొండ. హీరోగా దేవరకొండ ఇంట్రీ ఇవ్వకముందే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. తర్వాత పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారి సుబ్రహ్మణ్యం సినిమాతో సెకండ్ హీరోగా ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం సోలో హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే ఈ పై ఫోటోలో ఆంజనేయులు మూవీ క్లైమాక్స్ సీన్లు కనిపిస్తున్న కెమెరామెన్ విజయ్ దేవరకొండనే అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి కొంతమంది మాత్రం విజయ్ దేవరకొండ కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.