ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ విపరీతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల పుట్టినరోజును పురస్కరించుకొని.. వారి బ్లాక్ బస్టర్ సినిమాలను 4k వర్షన్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇక వారి సినిమాలకోసం థియేటర్ల దగ్గర అభిమానుల సందడి వేరే లెవెల్‌లో ఉంటుంది. అసలు సినిమాలు లేక మూసుకోవాల్సిన పరిస్థితుల్లో.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాలు మళ్లీ నిలబెడుతున్నాయి. ఇక రీ రిలీజ్‌సినిమాలకు కూడా స్ట్రైట్ సినిమాలా.. ఫ్లెక్సీలు, బ్యానర్లతో థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు.
నిర్మాతలకు మరోసారి కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాలు రిలీజ్ అయి ఎలాంటి రికార్డులు సృష్టించాయో తెలిసిందే. మహేష్ బాబు నుంచి మురారి, పోకిరి, పవన్ కళ్యాణ్ నుంచి.. ఖుషి, మెగాస్టార్ నుంచి ఇంద్ర సినిమాలు 4k వర్షన్ లో రిలీజై రికార్డుల మోత మోగించాయి. ఈ క్రమంలోనే కింగ్ నాగార్జున హిట్ మూవీ మాస్ సినిమాను 4k వర్షన్‌లో రిలీజ్ చేశారు. నాగ్ పుట్టినరోజును పురస్కరించుకుంటూ ఆగస్టు 28న ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ లారెన్స్.. దర్శకుడుగా మారాడు. ఇక డైరెక్టర్గా మొదటి సినిమాతోనే లారెన్స్‌కు బ్లాక్ బస్టర్ సక్సెస్ పడింది.
నాగ్‌కు జ్యోతిక జంటగా నటించిన ఈ మూవీలో రఘువరన్, రాహుల్ దేవ్ విలన్ పాత్రల్లో మెప్పించారు. ఇక ఈ సినిమా నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అందుకొని.. హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇందులో భాగంగా రిలీజ్‌లోను మాస్.. మంచి వసూలు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేశాయి. అయితే వారి అంచనాలకు తగ్గట్టుగానే గుణాంకాలను బట్టి సినిమా ఫస్ట్ రోజు 63% ఆక్యుపెన్సితో రూ.4.09 లక్షలు సాధించగా.. ఏపీ తెలంగాణలో 44% మాత్రమే ఆకీఫెన్సీ తో రూ.11.3 లక్షలు, కర్ణాటకలో రూ.13 లక్షల కలెక్షన్లను దక్కించుకుంది. ఇలా భారతదేశ వ్యాప్తంగా రూ.12.6 లక్షల వసూలను రాబట్టిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. మొత్తంగా చూస్తే సీనియర్ హీరోలు రీ రిలీజ్ కలెక్షన్ల విషయంలో.. నాగ్ చాలా వరకు వెనకబడి ఉన్నాడట.