హీరో వినీత్ కూతురు ఇప్పుడెలా ఉందో చూసారా.. అమ్మ‌డు భలే క్యూట్ గా ఉందే..!

ఒకప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోగా రాణించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు వినీత్‌. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో హీరోగా నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. 1996లో రిలీజ్ అయిన ప్రేమదేశం సినిమాతో యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ద‌క్కించుకున్నాడు. ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ అందుకోవడంతో.. వినీత్‌కు మార్కెట్ పెరిగింది. ఈ క్రమంలో జెంటిల్మెన్, సరిగమలు, వైఫ్ ఆఫ్ వి.వరప్రసాద్, నీ ప్రేమకై, రుక్మిణి, లాహిరి లాహిరి లాహిరిలో, చంద్రముఖి లాంటి సినిమాలు అవకాశాలను దక్కించుకొని ఆకట్టుకున్నాడు.

హీరో గానే కాదు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించి మెప్పించాడు. తర్వాత కొన్ని నెలపాటు ఇండస్ట్రీకి దూరమైన వినీత్ మళ్లీ ఇప్పుడిప్పుడే తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారుతున్నాడు. ఇక సోషల్ మీడియాలను యాక్టివ్గా ఉంటూ.. తన సినిమాల, ఫ్యామిలీలకు సంబంధించిన అప్డేట్స్ షేర్ చేసుకుంటున్నాడు. వినీత్ హీరో గానే కాదు.. మంచి డాన్సర్ గా కూడా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా భరతనాట్యంలో ఎన్నో కచేరీలలో తన ప్రతిభను చాటాడు. వెండితెరపై హీరోగా అలరించిన వినీత్.. విదేశాల్లో భరతనాట్య‌ కార్యక్రమాల్లో ఇప్పటికి సందడి చేస్తున్నాడు.

అలాగే ఇండస్ట్రీలో భరతనాట్య‌ కళాకారుడు.. డబ్బింగ్ ఆర్టిస్ట్, కొరియోగ్రాఫర్ గా మల్టీ టాస్కట్లు ప్లే చేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వినీత్.. లేటెస్ట్ ఫ్యామిలీ పిక్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. 2004 ఆగస్టు 28న చెన్నైకి చెందిన ప్రసిల్లా మీనన్‌ను ఎతేంజ్‌డ్ మ్యారేజ్‌ చేసుకున్నాడు వినీత్. వీళ్ళకు అవంతికా అనే ఓ పాప ఉంది. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫ్యామిలీ పిక్‌లో అవంతిక పిక్స్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. వినీత్ కూతురు భలే క్యూట్ గా ఉందే అంటూ.. క్యూట్నెస్ ఓవర్ లోడెడ్ కుట్టి అంటూ త‌మ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.