తాజాగా పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. సీతారామం మూవీ డైరెక్టర్ హనురాగపూడి డైరెక్షన్లో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఇటీవల గ్రాండ్ లెవెల్లో పూర్తయ్యాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ప్రముఖ యూట్యూబర్, కొరియోగ్రాఫర్ ఇమాన్వి ఇస్మాయిల్ ను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు మేకర్స్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఎన్నో విషయాలు నెటింట వైరల్ గా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎవరికీ ఈ అమ్మడి పేరు కూడా సరిగ్గా తెలియదు. అయితే ప్రభాస్‌తో ఇమన్వీ జత కడుతున్న క్రమంలో.. ఈ అమ్మడు ఒక్కసారిగా స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. అమ్మడి పేరు మారుమోగిపోతుంది. ఓవర్ నైట్ లోనే అమ్మడి ఫాలోవర్స్ కూడా భారీ రేంజ్ లో పెరిగిపోవడం విశేషం.
అంతేకాదు ఈమెకు సంబంధించిన ప్రతి విషయాన్ని.. అమ్మడి బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకోవాలని ఆశక్తి అభిమానుల్లో మొదలైంది. ఇక గూగుల్ లో ఇమన్వీ పై తెగ సెర్చింగ్లు చేసేస్తున్నారు నెటిజన్లు. ఇక యూట్యూబర్‌గా, కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్న ఇమన్వీకి.. నిన్న మొన్నటి వరకు కేవలం 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా.. ప్రభాస్ తో సినిమాను ప్రకటించిన క్రమంలో భారీ లెవెల్ లో ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోయింది. కాగా తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ తో నటించేందుకు ఫౌజి సినిమా కోసం రెమ్యునరేషన్ ఎంత తీసుకుందో అనే ఆశక్తి అభిమానుల్లో నెలకొంది. దీనికి సంబంధించిన ఓ వార్త నెటింట తెగ వైరల్‌గా మారుతుంది.
యూట్యూబర్‌గా ఇమాన్వీ నెలకు రూ.3నుంచి రూ.5 లక్షల వరకు సంపాదింస్తుంది. అయితే ఇప్పుడు ప్రభాస్ తో సినిమాకు కమిట్ అయిన ఇమాన్వి.. రెమ్యూనరేషన్ తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఇంతకీ అమ్మడు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో చెప్పలేదు కదా.. ప్రభాస్ తో సినిమా కోసం ఈ ముద్దుగుమ్మ ఏకంగా కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటుందట. ఈమె ఈ రేంజ్ లో క్రేజ్ సంపాదించడమే కాదు.. రెమ్యూనరేషన్ మొదటి సినిమాకే కోటి రూపాయలు అందుకోవడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇక సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతుంది. దీంతో ఈమెకు పాన్ ఇండియా రేంజ్ లో భారీ క్రేజ్ ఏర్పడుతుంది. ఇక తెలుగులో ఈ అమ్మడికి ముందు ముందే మరిన్ని అవకాశాలు దక్కడం ఖాయమని సినీ విశ్లేషకుల నుంచి అభిప్రాయలు వినిపిస్తున్నాయి