టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తారక్.. కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్నారు. దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా పవర్ఫుల్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడని.. తారక్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని సమాచారం. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇప్పటికే మాస్ లుక్‌లో కనబడుతున్న సంగతి తెలిసిందే. అంతే కాదు దేవర సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు మేకర్స్ అంత సిద్ధం చేసుకున్నారు. తాజాగా ఈ సినిమా చివరి షెడ్యూల్ పూర్తయిందని.. ఎన్టీఆర్ తన పోస్ట్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే.
కాగా ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్‌తో కొత్త సినిమాను కూడా ప్రారంభించేశారు. ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నారు మేకర్స్. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సినిమా వార్2లోను బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి తారక్ నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ బిగ్ షాకింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారింది. దీంతో అభిమానులంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. జూనియర్ ఎన్టీఆర్ తన పేరులోని జూనియర్ అనే పదాన్ని తీసేయాలని ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. తాజాగా ఎన్టీఆర్ టీం నుంచి వచ్చిన అఫీషియల్ అనౌన్స్మెంట్లో.. ఎన్టీఆర్ పేరు మిస్టర్ ఎన్టీఆర్ అని మెన్షన్ చేశారు. దీంతో జూనియర్ అనే ట్యాగ్‌ను మార్చేసి మిస్టర్ ట్యాగ్‌ను తన పేరుతో మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
దీనిపై అభిమానుల నుంచి రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్కు ఇప్పటికే 40 సంవత్సరాలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూనియర్ అనే పదం అవసరం లేదంటూ.. ఇండస్ట్రీకి మూడోతరం ఎన్టీఆర్ కూడా పరిచయం కానున్నారు.. ఈ క్రమంలో వీరి పేర్లు ఫ్యాన్స్‌లో కన్ఫ్యూషన్ రాకూడదని ఉద్దేశంతోనే జూనియర్ ట్యాగ్‌ను తీసేసి మిస్టర్ ఎన్టీఆర్ అనే జోడించుకున్నారేమో అంటూ.. మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఒక్కసారిగా జూనియర్ అన్ని ట్యాగ్న తీసేసి మిస్టర్ అనే ట్యాగ్ పెట్టుకుంటే అసలు పేరుకు సెట్ కావడం లేదంటూ.. ఇలా రకరకాలుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తన బ్రాండ్ ను ఎస్టాబ్లిష్ చేయడం కోసమే మిస్టర్ ఎన్టీఆర్ అని ట్యాగ్ తారక్‌కు మేకర్స్ జోడించారని సమాచారం.