‘ గేమ్ చేంజర్ ‘ విషయంలో చ‌ర‌ణ్ ఇంత కామ్ అయిపోయాడేంటి… ఏదో తేడా కొట్టేసింది..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చేతినిండా వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్న చరణ్ ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో గేమ్స్ చేంజర్ లో నటిస్తున్నాడు. అయితే శంకర్ ప్రస్తుతం తాను దర్శకుడుగా వ్యవహరించిన భారతీయుడు 2 సినిమా రిలీజ్ పనిలో బిజీగా గ‌డుతున్నాడు. ఈనెల 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో గేమ్ చేంజర్‌ సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేసి ఆ సినిమాను కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు శంక‌ర్‌.

Game Changer: Huge update! Shankar says Ram Charan's movie 'will be  released...'

ఇక రామ్ చరణ్ ఎన్ని ప్రాజెక్టులు చేతినిండా ఉన్నా కూడా గేమ్ చేంజర్‌ సినిమా విషయంలో శంకర్ ఇంత ఆలస్యం చేస్తున్నా.. నిశ్శబ్దంగా ఉండడానికి కారణం ఏంటి అంటూ నెటింట‌ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో చరణ్ ఈ సినిమా విషయంలో కామ్ గా ఉండడానికి కారణం ఆయన యాక్టింగ్ కు అదే రేంజ్ డెప్త్‌ ఉండటమేనని.. తెలుస్తుంది. ఇప్పటికే రంగస్థలం సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపించిన చరణ్.. ఈ సినిమాలో అంతకుమించి నటిస్తున్నాడు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

Ram Charan's look from Shankar directorial Game Changer leaked from the sets.  See here | Telugu News - The Indian Express

అందుకోసం ఈ సినిమా చాలా రోజులు లేట్ అవుతున్న చరణ్ ఏమీ మాట్లాడకుండా ఉంటున్నాడని.. ఒకసారి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చరణ్ కేటాయించిన సమయానికి, ఆయ‌న వెయిటింగ్ కి తగ్గ ఫలితం వస్తుందని.. పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు వస్తుందని నమ్మకంతోనే చ‌ర‌ణ్‌ సినిమాను శంకర్ ఎంత డిలే చేస్తున్న పెద్దగా పట్టించుకోవడం లేదంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాతో చరణ్ నటనకు నేషనల్ అవార్డు రావడం పక్కా అంటూ సినిమా యూనిట్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.