ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయమయ్యాడు ప్రభాస్. తర్వాత రిలీజ్ అయిన వర్షం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక రాజమౌళి డైరెక్షన్లో ఛత్రపతి సినిమా ప్రభాస్ కెరీర్ మలుపు తిప్పింది. ప్రభాస్ ని టాలీవుడ్ స్టార్ హీరోగా మాల్చింది. అయితే మరోసారి రాజమౌళి చేసిన బాహుబలి సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్‌ను దక్కించుకున్నాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను దక్కించుకున్న ప్రభాస్.. ఈ సినిమా తర్వాత నుంచి భారీ ప్రాజెక్టులకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ప్రభాస్ తాజాగా రిలీజ్ అయిన కల్కి తో మరోసారి బ్లాక్ బస్టర్ తో రికార్డులు క్రియేట్ చేశాడు. రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.1000 కోట్ల దిశగా పరుగులు తీస్తుంది. ఈ క్రమంలో కల్కి తర్వాత ప్రభాస్ నెక్స్ట్ మూవీల లైనప్ విషయంలో మరింత ఆసక్తి నెలకొల్పింది.
అయితే ప్రభాస్ నెక్స్ట్ సినిమాల గురించి ఓ న్యూస్ అందరికీ షాక్ ఇస్తుంది. అదేంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఆల్మోస్ట్ అరడజన్ సినిమాలు ఉన్నాయని.. అన్ని పాన్ ఇండియా సినిమాలే అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యన విడుదలైన ప్రభాస్ సలార్ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకు సీక్వెల్ గా సలార్2 రాబోతుంది. మరో పక్క ప్రభాస్ మారుతి డైరెక్షన్లో రాజా సాబ్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూట్ ఆల్రెడీ సగం పూర్తయింది.. కల్కి హడావిడి అయిపోయిన వెంటనే మిగతా షూటింగ్ కూడా పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. ఇక ఈ సినిమా తర్వాత సీతారామమ్ మూవీ తో భారీ పాపులారిటి దక్కించుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్‌లో మరో సినిమా నటించనున్నాడు.
ఈ సినిమాకు సెట్స్ వర్క్ కూడా ప్రారంభమైందని మూడు పాటలను కూడా రెడీ చేసినట్లు ఇటీవల ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ వివరించాడు. ఇక వీటితో పాటే కల్కి కొనసాగింపు కల్కి 2 సినిమా షూట్ కూడా త్వరలోనే పూర్తి చేయనున్నాడట. ఇప్పటికే కల్కి 2 ఆల్రెడీ 60% పూర్తయిందని.. మిగిలిన షూటింగ్ వచ్చే ఏడాదిలోపు ఫినిష్ చేసి రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత అశంవిని దత్త్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలతో పాట చానిమల్ మూవీ తో బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్ రెడ్డి వంగాతో స్పెరిటి సినిమా అనౌన్స్ చేశాడు ప్రభాస్. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. వచ్చే ఏడాదిలో స్పిరిట్ మూవీ షూట్ ప్రారంభమవుతుందని.. గతంలో సందీప్ రెడ్డి వంగ వివరించాడు. వీటితో పాటు బాలీవుడ్ డైరెక్టర్ సిథ్థార్ధ్ ఆనంద్ డైరెక్షన్లో ప్రభాస్ సినిమా రానుందని గతంలో అనౌన్స్ చేశారు. ఇలా ప్రస్తుతం చేతినిండా ఆరు భారీ ప్రాజెక్టుల తో అందరి హీరోలా లైన్ అప్ కంటే బిజీ లైన్ అప్ తో తన స్టామినాను ప్రూవ్ చేశాడు మన ప్రభాస్ రాజు.