బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ర‌జ‌నీ – క‌మ‌ల్ కాంబో సినిమా ఎందుకు రాలేదు… ఇద్ద‌రి మ‌ధ్య ఏంటా ప్రాబ్లం..?

తమిళ్ సినీ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోలుగా కొన‌సాగుతున్న వారిలో కమల్ హాసన్, రజనీకాంత్ పేర్లు మొద‌టి వ‌రుస‌లో ఉంటాయి. వీరిద్దరూ ఎవరికీ వారు తమకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ ఏర్పర్చుకున్ని ఇండ‌స్ట్రీలో రాణిస్తు్నారు. ఇద్దరికీ సౌత్‌లో మంచి ఫ్యాన్ బేస్‌ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోస్‌ ఇప్పటికీ కుర్రహీరోలకు పోటీగా బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఇద్దరూ ప్రాణస్నేహితుల‌న్న సంగ‌తి తెలిసిందే. ఒకప్పుడు ఇద్దరు కలిసి దాదాపు 16 ల్లో కలిసి క‌నిపించారు. చివరగా హిందీ గెరాఫ్తార్ మూవీలో కలిసి న‌టించారు.

Pics: Rajinikanth, Kamal Haasan shoot in same studio after 21 years - India Today

1985 లో తెర‌కెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటించాడు. అయితే ఇండస్ట్రీలో సూపర్‌స్టార్‌లుగా స్టేట‌స్‌ సాధించిన తర్వాత మాత్రం ఇద్దరూ కలిసి ఒక్క లో కూడా కనిపించలేదు. అయితే ఇద్దరి మధ్య స్నేహం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. ఈ క్ర‌మంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ హాసన్ మాట్లాడుతూ.. రజినీకాంత్ తో తనకున్న స్నేహం గురించి వివ‌రించాడు. ఇక ఈ ఇంట‌ర్వ్యూలో మీరు మళ్లీ భవిష్యత్తులో క‌లిసి నటిస్తారా..? అనే ప్ర‌శ్న ఎదురుకాగా దానికి ఆసక్తికర స‌మాధానం చెప్పాడు కమల్.

Kamal Haasan interview | 'I will get back to my criticism of parties but this is not the time for it' - The Hindu

మా కాంబినేషన్ అనేది ఇప్పుడు కొత్తేమ్‌ కాదు. గతంలో మేమిద్దరం కలిసి చాలా సినిమాలు న‌టించాం. కానీ కొన్నాళ్లకు మేము కలిసి పనిచేయకూడదని ఫిక్స్ అయ్యాం. మా ఇద్దరి మధ్య మంచి కాంపిటీష‌న్‌ ఉంది. కానీ అసూయ మాత్రం కాదు. మా ఇద్దరి దారులు వేరు. మాకు నిర్మాత కె. బాలచందర్ గారు గురువు. మా ఇద్దరి మార్గాలు వేరైన మేము ఒక‌రితో ఒక‌రు పోటి ప‌డ‌తామే కాని.. ఒకరిపై మరొకరం ఎప్పుడు చులకన వ్యాఖ్యలు చేసుకోము. మేము సీనియర్స్ కాబట్టి ఇలా ఉంటాం అనుకోకండి.. 20 ఏళ్ల నుంచి మేం ఇలాగే ఉన్నాం. ఇప్పటికీ మా స్నేహం అలానే కొనసాగుతుంది అని వివ‌రించాడు.