ప్రభాస్ ‘ కల్కి ‘ కాదా.. విలేఖరు ప్రశ్నకు నాగ్ అశ్విన్ మైండ్ బ్లాకింగ్ ఆన్సర్..!

గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన క్రేజీ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడి. నాగ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. మొదటి వారంలోనే రూ.700 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా.. ప్రస్తుతం రూ.1000 కోట్ల రన్ వైపుగా దూసుకుపోతుంది. ఇప్పటికే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా సాధించిన కల్కి.. ఈ వారంలో అన్ని ఏరియాల్లో లాభాల్లో దూసుకుపోతోంది. బయ్యర్లకి, ఎగ్జిబిటర్లకి లాభాలు తెచ్చి పెట్టింది. అయితే మూవీ సక్సెస్ సాధించిన తర్వాత మొదటిసారి నాగ్ అశ్విన్ మీడియా ముందుకు వచ్చి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. మూవీ సెకండ్ పార్ట్ కి ఇంకా పని చేయాల్సి ఉందని.. ఎప్పుడు రిలీజ్ చేస్తామని అంశంపై ఇంకా క్లారిటీ లేదంటూ చెప్పుకొచ్చాడు.

Director Nag Ashwin Interaction With Media | Kalki 2898 AD | #EpicBlockbusterKalki - YouTube

సినిమాలో మహాభారతం ఎలిమెంట్లను చూపించిన క్రమంలో రెండో పార్ట్ లో కూడా ఆ పాత్రలు.. ఆ కథతో మూవీ తెరకెక్కుతుందని వివరించాడు. ఇక తనకు మహాభారతం పై సినిమా చేసే ఆలోచన లేదని వివరించాడు. ఈ మూవీలో కర్ణుడి పాత్ర గురించి మాట్లాడిన అశ్విన్.. సినిమా కోసం ఆ పాత్రను పుట్టించినట్లు వివరించాడు. ఇక కల్కి పాత్రలో ప్రభాస్ కాదా.. ఎవరు కల్కి పాత్రలో కనిపిస్తారు అనే ప్రశ్నకు మైండ్ బ్లాకింగ్ సమాధానాన్ని ఇచ్చాడు. ఆ పాత్రకు ఇంకా ఎవరు ఫిక్స్ కాలేదని.. ప్రస్తుతం స్టోరీ పరంగా కడుపులో పెరుగుతున్న కల్కి పుట్టడానికి ఇంకా సమయం ఉందని.. అందరికీ బిగ్ సస్పెన్స్ ఇచ్చాడు. కల్కి పాత్రనే సినిమాకి మెయిన్ హీరో కాగా.. ఇప్పటివరకు ఆ పాత్రకి ఎవరిని ఫిక్స్ చేయలేదని నాగ అశ్విన్ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

Kalki 2898 AD: Nag Ashwin calls Deepika Padukone's fire scene his most favourite: 'It was a leap of faith' - Hindustan Times

సుప్రీం యస్కిన్ పాత్రతో కల్కి పోరాడాల్సి ఉంది. అలాంటి పవర్ ఫుల్ రోల్ కు ప్రభాస్ కాకుండా మరో ఇతర హీరో నటిస్తే సినిమాలో ఏమాత్రం న్యాయం జరగదు. ఈ క్రమంలో నాగ్‌ అశ్విన్ ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదని చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ఈ సినిమా కోసం ఆ ప్రొడక్షన్ టీమ్ అంతా ఎంతో కష్టపడ్డారని.. ఇందులో నాకు ఇష్టమైన ప్రదేశం వచ్చేసి శంబాల స్టెప్స్ అంటూ చెప్పుకొచ్చాడు. అక్కడే ఎప్పుడు కూర్చునే వాడినని.. అక్కడ సన్రైజ్, సన్ సెట్ చాలా అద్భుతంగా ఉంటాయని వివరించాడు. కృష్ణుడి పాత్రలో మహేష్ బాబుని తీసుకుంటే బాగుండేదని రిపోర్టర్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. దానికి స్పందించిన అశ్విన్ ఈ సినిమాలో కాదు కానీ.. వేరే సినిమాలో ఆయన కృష్ణుడుగా నటిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.