‘ జై హనుమాన్ ‘ మూవీ లో హనుమాన్ గా చరణ్.. కానీ అసలు ట్విస్ట్ ఇదే..?

ఈ ఏడాది మొదట్లో సంక్రాంతి బరిలో రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ సాధించిన‌ సినిమాల్లో టక్కున గుర్తుకు వచ్చేది హనుమాన్. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలతో తలపడి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమాతో.. ప్రశాంత్ వర్మ కు పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ప్రశాంత్ వర్మతో.. ప్రస్తుతం స్టార్ హీరోలు సైతం సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే లెవెల్ కు ప్రశాంత్ వర్మ ఎదిగాడు. రూ. 3.30కోట్ల గ్రాస్‌వ‌సూళ‌ను కొల‌గొట్టి సంచలనం సృష్టించింది. తేజ సజ్జ మార్కెట్ కూడా ఊహించని రేంజ్‌లో పెరిగింది. ఈ సినిమా వల్ల దేశవ్యాప్తంగా హనుమాన్ పేరు మారు మోగిపోయింది.

Chiranjeevi: Proud moment for Indian cinema: Chiranjeevi on Ram..

అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా జై హనుమాన్ రానున్న సంగతి తెలిసిందే. ఇందులో హనుమాన్ పాత్రలో ఎవరు నటిస్తారు.. అనే అంశంపై ప్రేక్షకుల ఆసక్తి మొదలైంది. కాగా జై హనుమాన్ రోల్‌లో రామ్ చరణ్ కనిపిస్తారని వార్తలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి, చరణ్ ఇద్ద‌రిలో ఎవరో ఒకరు ఇందులో నటించే అవకాశం ఉందట. ఇక తాజాగా హనుమాన్ నిర్మాతల్లో ఒకరైన చైతన్య రెడ్డి ఇప్పటికే జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైందని వివరించింది. 2025 సంక్రాంతి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదంటూ చెప్పుకొచ్చాడు. హనుమాన్ సినిమాకు ఈ రేంజ్ లో రిచ్ రావడం అస్సలు ఊహించలేదని చైతన్య రెడ్డి చెప్పుకొచ్చింది. మార్వెల్ తరహా కథాంశాన్ని తీసుకుంటామంటే ఆ రీచ్ ఉండాలి కనుక.. కొంత సమయం తీసుకుని సినిమాను క్వాలిటీతో తెరకెక్కించాలని ఆలోచనలో ఉన్నామని చెప్పుకొచ్చింది.

Jai Hanuman: జై హనుమాన్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత - NTV Telugu

జై హనుమాన్ మూవీ లో హనుమాన్ ఫ్రాంచైజ్ లో నటించే హీరోలు అందరిని పరిచయం చేస్తారని సమాచారం. జై హనుమాన్ మూవీ భారీ బడ్జెట్ తో రూపొందుతుందని టాక్. ఇక ఈ సినిమా విజువల్స్ వండర్ గా తిరగెక్కనుందని.. ట్విస్టులు కూడా చాలా ఉండనున్నాయ‌ని టాక్‌. జై హనుమాన్‌లో తేజ స‌జ్జ‌ కూడా కనిపిస్తాడు. కానీ.. ఆ పాత్రను న‌డివి చాలా తక్కువగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయి పెంచేలా తెరకెక్కిన తాజా సినిమాల్లో హనుమాన్ కూడా ఒకటి అనడంలో సందేహం లేదు. ఇక జై హనుమాన్ సినిమాలో రామ్ చరణ్ హనుమాన్ పాత్రలో నటిస్తున్నారనే న్యూస్ ఫ్యాన్స్‌కు ఆనందాన్ని కలుగచేస్తుంది. కానీ హనుమాన్ రిలీజ్ ఈ సంక్రాంతికి ఉంటుందని అంతా భావించారు. ఇలాంటి క్రమంలో ప్రొడ్యూసర్ ఇప్పట్లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు లేవని ట్విస్ట్ ఇవ్వడంతో అంతా నిరాశ‌ వ్యక్తం చేస్తున్నారు.