పవన్ తో గొడవలపై స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు క్లారిటీ.. ఆ వార్తలు నిజమే అంటూ.. ?

స్టార్‌ ప్రొడ్యూసర్ సురేష్ బాబు.. రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాలుకు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక ఈయనకు సౌమ్యుడు అనే ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. ఇక‌ తన సినిమాల ప్రమోషన్స్ లో మాత్రమే కనిపించే సురేష్ బాబు.. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో అతనికి గొడవలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలపై స్పందించాడు.

Why Suresh Babu Is In Hidden Mode?

ఇక సురేష్ బాబు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యంగ్‌గా ఉన్నప్పుడు కొంచెం చూడడానికి కమల్ హాసన్ లానే ఉండే వాడినని.. మా ఇద్దరి కార్ మోడల్ కూడా ఒకటే కావడంతో చాలామంది నన్ను కమలహాసన్ అని పొరపడేవారు అంటూ వివరించాడు. దర్శకుడు భారతిరాజా.. సురేష్ బాబుని హీరోగా పరిచయం చేయాలని భావించాడట. అప్పట్లో స్టార్ డైరెక్టర్ గా ఉన్న భారతిరాజ ఆఫర్‌ని.. సురేష్ బాబు రిజెక్ట్ చేశాడట. తన‌కు హీరోగా నటించడం ఇష్టం లేదని.. మొదటి నుంచి బిజినెస్ చేయాలని ఆసక్తి ఉందని చెప్పడంతో.. సురేష్ బాబు హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాలేదు. నిర్మాతగానే మొదటి నుంచి ఫిక్స్ అయిపోయారు.

Gopala Gopala (2015) - IMDb

ఇక పవన్ కళ్యాణ్ గోపాల గోపాల సినిమాకు సురేష్ బాబు ప్రొడ్యూసర్గ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైంలో పవన్ కు సురేష్ బాబుకు మధ్యన గొడవలు జరిగాయని వాదన వినిపించింది. దీనిపై ఇంటర్ యువర్ సురేష్ బాబును ప్రశ్నించగా.. అవును నిజమే అంటూ సమాధానం చెప్పాడు. మా ఇద్దరికీ మధ్యన గొడవ జరిగిన మాట నిజమే కానీ.. తర్వాత అన్ని సర్దుమనిగాయి.. ఇప్పుడు మా ఇద్దరికీ ఎలాంటి గొడవలు లేవు.. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడం నాకు సంతోషంగా అనిపించింది అంటూ సురేష్ బాబు వివరించాడు. గొడవకు కారణం మాత్రం ఆయన రివీల్ చేయలేదు.