మహేష్ లో నమ్రతకు అసలు నచ్చని క్వాలిటీ ఏంటో తెలుసా.. అలా చేస్తే కాస్త కూడా సహించదా.. ?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ బేస్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఐదు పదుల వయసు మీద పడుతున్న ఇప్పటికీ యంగ్ హీరోలు ఆకట్టుకుంటున్న మహేష్ బాబు.. ఆయన భార్య నమ్రత లక్షలాది మంది టాలీవుడ్ ప్రేక్షకులకు ఫేవరెట్ కపుల్ గా కొనసాగుతున్నారు. ఇక ఈ జంట ఒకరినొకరు ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ అంతే అన్యోన్యంగా ఉంటూ తమ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కాగా నమ్రత ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా నటించి మంచి ఇమేజ్ ద‌క్కించుకుంది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఫ్యామిలీ బాధ్యతలను చూసుకుంటూ.. మరోవైపు మహేష్ బిజినెస్ లను కూడా రన్ చేస్తుంది.

అంతే కాదు అప్పుడప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ జంట గొప్ప మనసును కూడా చాటుకుంటారు. కాగా నమ్రత తరచు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన భర్త, కూతురు, కొడుకుకు సంబంధించిన అప్డేట్లను.. ఫోటోలను షేర్ చేసుకుంటుంది. ఇక వీరిద్దరూ ఒకరినొకరు వంశీ సినిమా టైంలో ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదని.. నమ్రత కొంతకాలం క్రితం జరిగిన ఇంటర్వ్యూలో వివరించింది. మొదట్లో ఫ్రెండ్ అయిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించుకున్నామని.. చెప్పుకొచ్చింది. ఇక ఇప్పటికీ నమ్రత మహేష్ ను అంతగానే ప్రేమిస్తుంది. అయితే మహేష్ కు సంబంధించిన ఓ క్వాలిటీ ఆమెకు అసలు నచ్చదని చెప్పుకొచ్చింది.

From first meeting, falling in love to their intimate wedding: Mahesh Babu and Namrata Shirodkar's evergreen love story

ప్రారంభంలో తను మహేష్ కి ఉన్న క్వాలిటీతో ఇబ్బంది పడ్డాన‌ని వివరించింది. మహేష్ చాలా రిజర్వ్డ్ గా ఉండేవాడని.. అసలు మాట్లాడేవాడు కాదని చెప్పుకొచ్చిన ఈ అమ్మడు.. ఓరి దేవుడా వీడు ఇలా ఉన్నాడు ఏంటి.. అనుకునేదాన్ని. ఎలాగైనా ఆ రిజర్వేషన్ బ్రేక్ చేయాలని ఫిక్స్ అయ్య అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ విషయంలో నేను సక్సెస్ అయ్యాను అంటూ వివరించింది. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంటున్నాడని.. బాగా మాట్లాడుతున్నాడని.. వివరించింది. ఇక‌ నా గురించి ఆయనకు, ఆయన గురించి నాకు బాగా తెలుసు.. మహేష్ నన్ను బాగా అర్థం చేసుకుంటాడు అంటూ వివరించింది నమ్రత.