డైరెక్టర్, ప్రొడ్యూసర్ లతో ఒక రాత్రి గడపాలంటూ హీరోయిన్ కు ఫోన్ కాల్.. ఆమె రియాక్షన్ ఇదే..

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ ఎప్పటినుంచో ఉందన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తమకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి ఎంతమంది హీరోయిన్లు, స్టార్ నటీమణులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇప్పటికే ఆడియన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. ఎన్నో వేధింపులను ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ, భయంకర రోజులను ఫేస్ చేశామంటూ వివ‌రిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇప్పటికీ తమ ప్రైవేట్ లైఫ్ గురించి బయట పెట్టేందుకు.. తము ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పేందుకు ఇష్టపడడం లేదు.

Sai Tamhankar: “Marathi film industry is different than Bollywood because…” | Rapid Fire

ఇక తాజాగా మరాఠీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సాయి తంహంకర్ తను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను షేర్ చేసుకుంది. ఇటీవల ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ అమ్మడు మాట్లాడుతూ కెరీర్ ఆరంభంలో ఓ క్యాస్టింగ్ కౌచ్ కాల్‌ వచ్చిందని.. చెప్పుకొచ్చింది. మిస్ మాలినికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఓ సినిమాలో హీరోయిన్ ఆఫర్ కోసం సెలెక్ట్ చేశారు. కానీ అందుకు డైరెక్టర్, ప్రొడ్యూసర్లతో పడుకోవాలంటూ డిమాండ్ చేశారు అని చెప్పుకొచ్చింది.

Marathi actress - Sai Tamhankar | Facebook

ఒక వ్యక్తి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని.. ఆఫర్ కావాలంటే ఓ నైట్ దర్శకుడు, నిర్మాత తో గడపాలంటూ ఆ వ్యక్తి చెప్పాడని.. అందుకు నేను అక్కడకు మీ అమ్మను ఎందుకు పంపకూడదు అని ప్రశ్నించానని.. దానికి అతను మౌనంగా ఉండిపోయాడు అంటూ చెప్పుకొచ్చింది. దాదాపు పది సెకండ్ల పాటు ఏం మాట్లాడలేదని.. మళ్లీ ఎప్పుడు నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పానని.. ఇప్పటివరకు అలాంటి ఫోన్ కాల్ మళ్లీ ఎప్పుడు రాలేదంటూ వివరించింది. మనకు సరైనది కాదని తెలిసిన విషయంపై ధైర్యంగా వాయిస్ రైజ్‌ చేయాలని నేను అప్పుడే ఫిక్స్ అయ్యా అంటూ వివరించింది. సాయి తమ్‏హంకర్ మరాఠీ కుటుంబానికి చెందిన అమ్మడు. 17 ఏళ్ళ వయసులోనే పలు సీరియల్స్ లో, సైడ్ రూల్స్ లో నటించిన ఈమె.. బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకొని మెప్పించింది. అమీర్‌ఖాన్‌ నటింయిన‌ గజినీ.. జియా ఖాన్ పాత్రకు స్నేహితురాలుగా ఆక‌ట్టుకుంది.