పుష్ప 2 మేకింగ్ లో ప్రొడ్యూసర్ పై అసంతృప్తిగా సుకుమార్.. కారణం ఇదే..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇంటెలిజెంట్ డైరెక్టర్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న శివకుమార్.. ప్రస్తుతం టాలీవుడ్ ఖ్యాతిని రెట్టింపు చేస్తున్న‌ స్థార్‌ డైరెక్టర్ల లిస్టులో మొదటి వరుసలో ఉన్నాడు. ఆయన చేసే ప్రతి సినిమాతో లాజికల్ సీన్స్ ఉండేలా చూసుకుంటూ.. కథపరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తెరకెక్కిస్తాడన్న సంగతి తెలిసిందే. ఇక అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన పుష్పా సినిమాలతో పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్గా సక్సెస్ అందుకున్న సుకుమార్.. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో బిజీగా గడుపుతున్నాడు.

I am so glad that we have come a long way together," wrote Pushpa director Sukumar as he pens down a sweet note for Allu Arjun on his birthday | Telugu Movie

మరోసారి ఈ సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకునేందుకు సిద్ధమవుతున్నాడట. ఇప్పుడు అనుకోకుండా ఈ సినిమా రిలీజ్ అనేది పోస్ట్‌పోన్ అయినా సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సినిమాలో బన్నీ చేయాల్సిన కొన్ని సీన్స్ ను మళ్లీ షూటింగ్ ప్రారంభించారట.ఈ క్ర‌మంలో పుష్పతో అల్లు అర్జున్ మరోసారి తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే సుకుమార్ ఈ విషయంలో కొంతవరకు అసంతృప్తిగా ఉన్నారని.. దానికి కారణం ప్రొడ్యూసర్ అని తెలుస్తుంది.

Sukumar decides to replace Samantha

ఈ సినిమా షూటింగ్ ప్రాసెస్ లో ప్రొడ్యూసర్ సుకుమార్ అడిగిన మొత్తంలో ఆయనకు పర్ఫెక్ట్ గా ఇవ్వడం లేదని.. దానివల్ల సుకుమార్ అవుట్‌పుట్ మీద కాస్త టెన్షన్ పెట్టుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ఇంకా కొన్ని సన్నివేశాలను తెరకెక్కించాల్సి ఉండగా.. దానికి అనుకున్న దానికంటే ఎక్కువగా బడ్జెట్ అవుతుండడంతో ప్రొడ్యూసర్ సుకుమార్ ని దానికి తగ్గట్టుగా బ్యాలెన్స్ చేసుకోమని సలహా ఇచ్చారట. మరి ప్రొడ్యూసర్ మాట విని సుకుమార్ ఆ సీన్స్‌ ఏదో విధంగా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తాడో..? లేదో..? వేచి చూడాలి.