‘ భారతీయుడు 2 ‘ సక్సెస్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురుచూపులు.. కారణం ఏంటంటే..?

శంకర్ డైరెక్షన్‌లో కమలహాసన్ హీరోగా భారతీయుడు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఎలాగైనా ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలని మెగా అభిమానులు భావిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇండియన్ 2 సక్సెస్ కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారా.. అసలు ఇండియన్ 2 సక్సెస్‌కి మెగా అభిమానులకు సంబంధమేంటి.. ఒకసారి చూద్దాం. శంకర్ డైరెక్షన్‌లె ప్రస్తుతం రామ్ చరణ్.. గేమ్‌చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శంక‌ర్ తెర‌కెక్కించిన ఇండియన్ 2 సినిమా మొదటి రోజు రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధిస్తే రామ్ చరణ్ సినిమాకు మరింతగా హైప్‌ పెరుగుతుందని వాళ్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Bharateeyudu 2 Movie (2024) | Release Date, Review, Cast, Trailer - Gadgets  360

అందుకే భారతీయుడు 2 సినిమా ఫస్ట్ రోజు చూడడానికి మెగా అభిమానుల సిద్ధమవుతున్నట్లు టాక్ నడుస్తుంది. ఇక నార్మల్‌గానే శంకర్ సినిమాలను తీయడంలో చాలా ఎక్స్పర్ట్. కనుక ఈ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చాలా మంది ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. మరి ఆ సినిమా మీద అందరు పెట్టుకున్న అంచ‌నాల‌ను శంక‌ర్‌ అందుకోగలుగుతాడా..? లేదా..? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Ram Charan arrives in Mysore in a private jet for Game Changer shoot -  India Today

ఇక పాన్ ఇండియాలో తెలుగు సినిమాలు రిలీజ్ అయి భారీ సక్సెస్ లో అందుకుంటున్న క్రమంలో భారతీయుడు 2 సినిమా రిలీజ్ ను ప్లాన్ చేశాడు శంకర్. మరి ఈ పాన్ ఇండియన్ మూవీ ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుందో.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. కమల్ హాసన్ విక్రమ్ తర్వాత హీరోగా నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక కమల్ పర్ఫామెన్స్ కి సినిమాల్లో ఎలాంటి స్కోప్ ఉంటుందో తెలిసిందే. కాగా కమల్ హాసన్ ఇండియన్ 2లో నటిస్తున్న ఈ పాత్రను అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.