మాకు డ్యాన్స్ తప్ప వేరే ఏదీ రాదు.. కన్నీళ్లు పెట్టుకున్న శేఖర్ మాస్టర్.. ఏం జరిగిందంటే..?

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు టాలీవుడ్ ప్రేక్షకులో పరిచయాలు అవసరం లేదు. తెలుగులో ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్.. సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూనే మరో పక్కన పలు బులితెర షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెటింట‌ వైరల్ గా మారింది.

మాకు డ్యాన్స్ తప్ప వేరే ఏం రాదు.. శేఖర్ మాస్టర్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్

ఇంతకీ ఏం జరిగిందో..? శేఖర్ మాస్టర్ అంతగా ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటో..? ఒకసారి తెలుసుకుందాం. తాజాగా ఢీ షో కి సంబంధించిన ప్రోమో నెటింట‌ వైరల్‌గా మారింది. అందులో మధు అనే ఓ కంటిస్టెంట్ పక్కన డ్యాన్సర్లు తప్పు వేయడంతో మధ్యలో పర్ఫామెన్స్ ఆపేసాడు. పర్ఫామెన్స్‌ని కంపోజ్ చేసిన డ్యాన్స్ మాస్టర్ స్టేజ్ పైకి వచ్చిన తర్వాత శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. మేము డ్యాన్సర్లు కదా మాకు డ్యాన్స్ తప్ప మరేది రాదు.

Sekhar Master : ఢీ షోలో ఏడ్చేసిన శేఖర్ మాస్టర్.. మాకు డ్యాన్స్ తప్ప ఏం  రాదు.. | Sekhar master crying in dhee show promo goes viral-10TV Telugu

డ్యాన్స్ మిస్ అయితే మాస్టర్ ఎక్కడ వెళ్ళిపోతాడో.. మాస్టర్ వెళ్ళిపోతే మాకు ఎక్కడ వరకు పోతుందో అని భయపడుతూ ఉండే వాళ్ళం.. అంటూ కంటతడి పెట్టుకుని ఎమోషనల్ అయ్యాడు. శేఖర్ మాస్టర్ మాటలకు అక్కడున్న వారంతా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. ఆ పర్ఫామెన్స్ కంపోస్ట్ చేసిన డ్యాన్స్ మాస్టర్ కూడా స్టేజ్ పైనే కంటతడి పెట్టుకున్నాడు. మరి శేఖర్ మాస్టర్ ఇంకేం మాట్లాడారు..? ఎందుకలా ఏడ్చారో..? మాత్రం సస్పెన్స్ గా ఉంచారు. ఈ విషయం తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు వచ్చి చూడాల్సిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట‌ తెగ వైరల్ గా మారింది. ఆ వీడియో పై నెటిజ‌న్స్‌ రకరకాలుగా స్పందిస్తున్నారు.