‘ పుష్ప 2 ‘ పోస్ట్‌పోన్‌కు కారణం రష్మికాన.. భలే ట్విస్ట్ ఇచ్చారే..?

తెలుగు ఇకాన్‌ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా.. ఆగస్ట్ 15న రిలీజ్ అని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత ఈ సినిమాను డిసెంబర్ చేసినట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ క్ర‌మంలో అల్లు అర్జున్ కు బ్యాడ్ టైం నడుస్తుందని.. తన మామ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా వ్యవహరిస్తూ ప్రచారాలు చేస్తున్న క్రమంలో.. నంద్యాల వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ గా అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో మెగా, అల్లు ఫ్యామిలీ మధ్యన వివాదాలు త‌లెత్తాయంటూ చర్చలు జరిగిన సంగతి తెలిసిందే.

Allu Arjun in Nandyal! Pushpa Actor Campaigns for YSR Congress Party Amid  Ongoing Lok Sabha Elections, Gets Mobbed by Fans (Watch Video) | LatestLY

ఈ క్రమంలో మెగా అభిమానులంతా అల్లు అర్జున్ పై ఫైర్ అయ్యారు. ఆ ఎఫెక్ట్ పుష్ప కలెక్షన్ల పై పడుతుందేమో అనే ఉద్దేశంతో మేకర్స్ సినిమాను పోస్ట్ పోన్ చేశారంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అందుతున్న వార్తల ప్రకారం నేషనల్ క్ర‌ష్ రష్మిక మందన కారణంగానే ఈ సినిమా పోస్ట్‌పోన్ అయిందట. ప్రస్తుతం సౌత్‌లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న ఈ అమ్మడు.. బాలీవుడ్ లోనూ వరుస సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయిన రష్మిక చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతుంది. ఇక రష్మిక కు మొదటి నుంచి డిసెంబర్ నెల బాగా కలిసి వస్తుంది.

Rashmika Mandanna back as Srivalli, 'Pushpa 2: The Rule' makers shares  intriguing first look poster on her birthday – ThePrint – ANIFeed

ఆమె నుంచి డిసెంబర్ లో రిలీజ్ అయిన అన్ని సినిమాలు మంచి సక్సెస్ సాధించడంతో పుష్ప 2 సినిమాకు కూడా ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందనే ఉద్దేశంతోనే సుకుమార్ ఈ సినిమాను డిసెంబర్ కు వాయిదా వేసాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన పుష్ప ఇప్పటికే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెకండ్ పార్ట్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక డిసెంబర్ 17న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో.. ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.