ఆఫర్లు కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే.. సంచలన కామెంట్స్ చేసిన జబర్దస్త్ రోహిణి..?

బుల్లితెర బెస్ట్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఇప్పటికే ఎంతోమంది స్టార్ కమెడియన్‌లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అలా మంచి ఫామ్‌లో దూసుకుపోతున్న వారిలో రోహిణి ఒకటి. ఈమె పేరు వినగానే ఫస్ట్ మన ఫేస్ లో నవ్వు వస్తుంది. తన నటనతో, కామెడీ టైమింగ్ తో అందరిని అంతలా ఆకట్టుకున్న రోహిణి.. కెరీర్ స్టార్టింగ్ లో బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించిన మెప్పించిన సంగతి తెలిసిందే. కానీ అమ్మడికి అనుకున్నంత పాపులారిటీ రాలేదు. జబర్దస్త్ తో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ రియాల్టీ షోలోకి వెళ్లే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. మరింత పాపులారిటీ వచ్చింది.

Jabardasth Rohini: "అతడే నా జీవితాన్ని నాశనం చేశాడు.. పెళ్లి చేసుకోకపోతే  అస్సలే ఊరుకోను" | Jabardasth Rohini Sensational Comments on Her Personal  Life Check Details - Telugu Filmibeat

ఇలా ఓ పక్క షోలు, మరోపక్క వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా గడుపుతున్న రోహిణి.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ స్టైలిష్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానుల‌తో పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న సమయంలో అవకాశాల కోసం చాలా మంది దగ్గరకు వెళ్లాల్సి వచ్చిందని.. అయితే ఎంతోమంది తనతో అసభ్యకరంగా మాట్లాడారని.. ఎక్కువగా కమిట్మెంట్ అడిగే వారే కనిపించారని చెప్పుకొచ్చింది. తనలో ఉన్న టాలెంట్ ని గుర్తుపట్టకుండా ఇలాంటి చెత్త ఇన్ఫర్మేషన్‌ను అడగడంతో చాలా బాధపడేదాన్ని అంటూ రోహిణి వివరించింది.

Rohini - Movies, Biography, News, Age & Photos | BookMyShow

అంతేకాదు తన తండ్రి లాంటి వ్యక్తి కూడా ఒక ఆడిషన్స్ కి వెళ్తే నీకు అవకాశం ఇస్తే నాకేంటి అంటూ అడిగాడని.. అతని ప్రవర్తన చూసి వెంటనే అక్కడికక్కడ ఆ సినిమా రిజెక్ట్ చేసి వెనక్కి వచ్చేసానంటూ చెప్పుకొచ్చింది. ఇలా కెరీర్‌లో ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. ఎలాంటి తప్పుడు మార్గం వైపు నేను మొగ్గుచూపు లేదని.. నా టాలెంట్ ని మాత్రమే నమ్ముకుని ఈ పొజిషన్‌కు వచ్చానని వివ‌రించింది. ఈ జీవితం నాకు చాలా సంతృప్తినేస్తుందంటూ వివరించింది. ప్రస్తుతం నా లైఫ్ లో పెద్దగా గోల్స్ ఏమీ లేవు. ఇప్పుడు గోల్ ఏమీ పెట్టుకోలేదు అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం రోహిణి చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారాయి.