త్వరలోనే రాజమౌళి బయోపిక్.. ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..?

టాలీవుడ్ దర్శకత్క ధీరుడు రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో మోడరన్ మాస్టర్స్ అనే పేరుతో ఓటీటీ ప్లాట్‌ఫారం ఎస్. ఎస్. రాజమౌళి పేరుతో బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ ఫీచర్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. ఇది సినీ డైరెక్టర్ రాజమౌళితో లీనమయ్యే ఓ ప్రయాణం. ఇంటర్వ్యూ, తెర వెనుక ఫొటోస్, ఆకర్షణీయమైన కథనాలను బేస్ చేసుకుని తెర‌కెక్కుతుంది. రాజమౌళి యొక్క సృజనాత్మక విశ్వాసాన్ని చుట్టుముట్టడం, భారతీయ అంతర్జాతీయ సినిమాలపై అతని విజువల్ థింకింగ్, ప్రగాఢ ప్రభావాన్ని చూపడం.. సినిమాను రూపొందించడానికి ఆయన చేసిన వినూత్న ప్రయత్నాలను ప్రదర్శించడం లక్ష్యంగా దీనిని రూపొందిచార‌ట‌.

Netflix Docu 'Modern Masters: SS Rajamouli' Honors the Brilliant Creator  Behind 'Baahubali' and Academy Award-Winning '

ఇక తాజాగా రాజమౌళి చిరునవ్వుతో కూడిన పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. మోడ్రన్ మాస్టర్ ఎస్. ఎస్. రాజమౌళి అనే టైటిల్ తో దీనిని అనౌన్స్ చేశారు. ఇక ఈ పోస్ట్ కు క్యాప్షన్ ఇస్తూ ఒకే వ్యక్తి.. ఎన్నో బ్లాక్బస్టర్స్, అంతులేని ఆశయాలు, లెజెండ్రీ ఫిలిం మేకింగ్, తన లక్ష్యాన్ని అందుకోవడానికి, శిఖరాన్ని చేరుకోవడానికి ఎంతైనా కష్టపడతాడు మోడరన్ మాస్టర్ రాజమౌళి అంటూ ట్యాగ్ చేశారు. ఆగస్టు 2న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంద‌ని వివరించారు. అనుపమా కేర్ ప్రొడ్యూసర్ గా.. ఈ డాక్యుమెంటరీ జేమ్స్ కామరూన్, జో రుస్సో తో పాటు గ్లోబల్ సెలబ్రిటీగా క్రేజ్‌ సంపాదించుకున్న ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రానా దగ్గుబాటి, రాంచరణ్ లాంటి సన్నిహితులు.. సహచర్ల వీడియోలు కూడా ఇందులో ఉన్నాయని తెలుస్తుంది.

S.S. Rajamouli: Epic Visionary

ఈ డాక్యుమెంటరీ గురించి చర్చిస్తూ ఆ ప్లాస్ ఎంటర్టైన్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ నాయర్ కొన్ని విషయాలను పంచుకున్నారు. అతని విలక్షణమైన ఆవిష్కరణ కథను రూపొందించే భారతీయ సినిమా నిర్మాణాన్ని విప్లవాత్మకంగా తీర్చిదిద్దిన అతన్ని టాలెంట్‌ను అతని కళాత్మక అభివృద్ధి ప్రారంభం నుంచి బాహుబలి, ఆర్‌ఆర్ఆర్‌ల‌తో సక్సెస్ వరకు వినయపూర్వకమైన కథగా అందించడానికి మేము సంతోషిస్తున్నాం. ఈ భాగస్వామ్యం ప్రపంచ ప్రేక్షకుల కోసం.. ప్రామాణికమైన భారతీయ కథలను రూపొందించడంలో మా అంకిత భావాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది అంటూ వివరించాడు.