సింగపూర్ లో సందడి చేసిన ఏపీ డిప్యూటీ సీఎం.. భార్య గ్రాడ్యుయేషన్ ఈవెంట్ కు హాజరైన పవన్ కళ్యాణ్..

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నాలెజనోవా టాలీవుడ్‌లో తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే మొదట్లో బయట జనానికి కనిపించని అన్నాలెజనోవా .. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం గా పగ్గాలు చేపట్టిన తర్వాత బయట ప్రపంచానికి కనిపిస్తూ కాస్త సందడి చేస్తుంది. పవన్ గెలుపు సంబరాలు, ప్రమాణస్వీకారంలో అన్నాలెజనోవా పాల్గొని వార్తల్లో హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

Pawan Kalyan attends his wife Anna's graduation ceremony | Telugu Cinema

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత.. ఆమెకు సంబంధించిన ప్రతి చిన్న విషయం నెట్టింట తెగ వైరల్ గా మారింది. ప్రస్తుతం అన్నాలెజనోవాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. అన్నాలెజనోవా గత కొంతకాలంగా చదువుకుంటుందని సమాచారం. ఓ పక్క ఫ్యామిలీని చూసుకుంటూనే.. మరో పక్కన ఆర్ట్స్ గ్రూపులో తన మాస్టర్స్ ను కంప్లీట్ చేసిందట ఈ అమ్మ‌డు. యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి అన్నాలెజనోవా తన మాస్టర్స్ ను కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది.

Telangana NavaNirmana Sena - Telangana News about hyderabad Rangareddy Real  estate

ఇక ఇటీవల అన్నాలెజనోవా గ్రాడ్యుయేషన్ ఈవెంట్స్ సింగపూర్ లో జరిగింది. ఈవెంట్ కోసం భార్యతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరై సందడి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోస్ నెటింట‌ తెగ వైరల్‌గా మారింది. ఇక రెండు రోజుల క్రితం పవన్ తన భార్య అన్నాలెజనోవాతో ఎయిర్పోర్ట్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. సింగపూర్ వెళ్తుండగా వారు ఎయిర్పోర్ట్‌లో కెమెరాలకు చిక్కారట‌.