సౌత్ స్టార్ హీరోయిన్ నయనతారకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయంతో లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలను యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్డేట్స్, ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అభిమానులు ఫీదా చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. తన ఇన్‌స్టా వేదికగా నయన్ హెల్త్ కు సంబంధించిన పోస్ట్‌ని షేర్ చేస్తూ హెబిస్కస్ టీ.. ఇది నాకు చాలా ఇష్టమైన, అత్యంత ఉత్తేజపరితమైన, ఆయుర్వేదంలో చాలా కాలంగా ఉపయోగించబడుతున్న టీ. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగ లభిస్తాయి.
మధుమేహం, అధిక కొలెస్ట్రాల, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలను మెరుగుపరచడానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది. బాడీ హీట్‌ను తగ్గించడానికి.. చర్మంపై మొటిమలు ఇతర ప్రాబ్లమ్స్ కు చెక్ పెట్టడానికి ఎంతగానో సహకరిస్తుంది వర్షాకాలంలో.. విటమిన్ల సమృద్ధిగా లభించడంతోపాటు.. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుందంటూ చెప్పుకొచ్చింది. సీజనల్ ఇన్ఫెక్షన్స్, అనారోగ్యం నుంచి కాపాడే యాంటీ బ్యాక్టీరియల్ ప్రభావాలను కలిగి ఉంటుందని.. కనుక ఈ టీ రోజు తాగి ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి అంటూ తన పోస్టులో వివరించింది. ఇక ఈ పోస్ట్ క్షణాల్లో నెటింట వైరల్‌గా మారింది.
దీంతో సమంతను విమర్శించిన డాక్టర్.. నయనతారపై కూడా ఫైర్ అయ్యాడు. సమంత తన ఫాలోవర్స్ ను తప్పుదోవ పట్టించిన దానికంటే ఈ సినిమా యాక్టర్ ఇంకా రెండు రెట్లు ఎక్కువగా తప్పుదోవ పట్టిస్తుందంటూ.. సంచలన కామెంట్స్ చేశాడు. ఆమెను ఫాలో అయ్యే 8.7 మిలియన్ మంది వ్యూవర్స్‌కు మందార పువ్వు టీ గురించి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుందని.. ఈ టీ టెస్ట్ బాగుందని చెప్పి వదిలేసి ఉంటే బాగుండేది అంటూ కామెంట్స్ చేశాడు. అలా కాకుండా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మాట్లాడింది.
సెలబ్రిటీలు వాళ్ళ మిడిమిడి జ్ఞానంతో జనాలకు పంచుతున్నారన్న విషయం మర్చిపోతున్నారని.. డయాబెటిస్, హైబీపీ, యాక్ని, యాంటీ బ్యాక్టీరియల్ అంటూ వివరిస్తున్నారని.. ఆమె చెప్పినవి జరుగుతాయని ప్రూఫ్స్ ఇప్పటివరకు లేదంటూ తన మెసేజ్ స్క్రీన్ షాట్ తో సహా షేర్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న నయనతార ఫ్యాన్స్ ఆ డాక్టర్ పై మండిపడుతూ నీకు ఇదే పనా.. ఎదుటివారిని విమర్శిస్తూనే ఉంటావా అంటూ అతనిపై ఫైర్ అయ్యారు. ఇక నయన్ మాట్లాడుతూ.. తెలివి తక్కువ వారితో వాదించవద్దు. మిమ్మల్ని వారి స్థాయికి తీసుకువెళ్లి ఓడిస్తారు అంటూ ఓ కొటేషన్ షేర్ చేసింది. దీంతోపాటే ఎవరికి నా పోస్ట్ గురించి వివరాలు కావాలో వారు.. ఈ పోస్ట్ చెక్ చేయండి అంటూ రెండు ఫోటోలు షేర్ చేసింది.