అక్కినేని అందగాడు నాగార్జున ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి ప్రేక్షకులు మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికి కుర్ర హీరోలతో పోటీ పడుతున్న నాగ్.. ఇద్దరు కొడుకులను ఇండస్ట్రీలో హీరోలుగా పరిచయం చేశాడు. ఇక నాగార్జున కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. సూపర్ హిట్గా నిలిచిన సంతోషం సినిమా ఒకటి. ఇదో అందమైన ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కి అప్పట్లో ఎంతో మంది ప్రేక్షకులకు కనెక్ట్ అయింది.
ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలవడమే కాదు.. నాగార్జున ఇమేజ్‌ను కూడా రెట్టింపు చేసింది. ఇక ఈ సినిమాలో శ్రియ, గ్రేసి సింగ్ హీరోయిన్లుగా నటించి మెప్పించారు. ఇక సంతోషం సినిమా తర్వాత శ్రియా హీరోయిన్గా భారీ పాపులారిటి దక్కించుకుంది. వరుస అవకాశాలు అందుకుని టాలీవుడ్ టాప్ హీరోయిన్గా మారిపోయింది. అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్గా నటించిన గ్రేసీ సింగ్ కు మాత్రం ఈ సినిమా తర్వాత ఊహించిన రేంజ్ లో అవకాశాలు రాలేదు. ఈ సినిమా తర్వాత చాలా కాలానికి అప్పుచేసి పప్పుకూడు, రామ రామ కృష్ణ కృష్ణ సినిమాల్లో నటించింది.
తర్వాత టాలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడంతో హిందీ, పంజాబీ భాషల్లో పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని మెప్పించింది. నటిగా మాత్రమే కాకుండా భారతనాట్యం, ఓడిస్సా నృత్యాలతో కూడా గ్రేసీ సింగ్ ప్రావిణ్యత పొందింది. పలు సీరియల్స్‌లో కూడా నటించిన ఈ అమ్మడు.. ఇప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన గ్లామర్ ఫోటోలను, వీడియోలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలో గ్రేసీ సింగ్ లేటెస్ట్ ఫోటోస్ నెటింట తెగ వైరల్‌గా మారాయి. సంతోషంలో నటించన హీరోయిన్ ఈమేనా.. ఏంటి ఇంతలా మారిపోయింది అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఓల్డ్ క్రష్ అంటూ.. అసలు గుర్తుపట్టలేకున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.